శ్రీ కాటి కోటేశ్వర స్వామి ఆలయ నూతన అర్చకుడికి నియామక పత్రం అందజేసిన మంత్రి సత్య కుమార్ యాదవ్

తాడిమర్రి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కాటి కోటేశ్వర స్వామి దేవాలయం లో నూతన అర్చకునిగా నియమితులైన చిల్ల బాల శివకు అధికారిక నియామక పత్రాన్ని రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్ చేతులమీదుగా అందజేయడం జరిగింది.
దేవాదాయాల శాఖ జాయింట్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ నియామకం అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ దేవాలయ పరిపాలన, నిత్య పూజా కార్యక్రమాలు ఆగమ శాస్త్ర సంప్రదాయాల ప్రకారం సమర్థంగా నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. నూతన అర్చకుడు బాల శివకు గ్రామస్తులు శుభాకాంక్షలు తెలియజేశారు

Posted Under AP
Editor