శ్రీ కాటి కోటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి సత్య కుమార్ యాదవ్: నిత్య అన్నదానానికి భారీ విరాళం

తాడిమర్రి మండలంలోని చిల్లవారిపల్లి గ్రామ సమీపంలో ఉన్న శ్రీ కాటి కోటేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వైద్య విద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సంధి రెడ్డి శ్రీనివాస్ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.
నిత్య అన్నదాన కార్యక్రమానికి మంత్రి సత్య కుమార్ యాదవ్ లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు. నిత్య అన్నదాన కమిటీ సభ్యులు మంత్రి సత్య కుమార్ యాదవును సన్మానించడం జరిగింది అలాగే ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మహాశివరాత్రి వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరగాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.
అనంతరం చిల్లవారిపల్లి గ్రామంలోని నారాయణరెడ్డి గృహంలో భోజనం చేశారు. తరువాత ముదిగుబ్బ మండలం సంకేపల్లిలో నిర్వహిస్తున్న వీరనారాయణ స్వామి దేవాలయం ఉత్సవాలకు మంత్రి బయలుదేరారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ హరీష్ బాబు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొంక నాగార్జున, బీజేపీ మండల కన్వీనర్ దేవర రాము, ఆరవేటి ఆనంద్, ఆరవేటి సదానంద, బిల్లే చంద్ర, ఎక్స్ ఎంపీపీ కొడిదల రాజశేఖర్, ఎక్స్ కన్వీనర్ కొడిదల సాయి పుల్లంపల్లి అశోక్ అనుకుర్తి రమణ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Posted Under AP
Editor