Latest Posts

రెడ్డిపల్లి గ్రామంలో గ్రామసభ నిర్వహించిన డిఎస్పి గారు..

శ్రీ సత్య సాయి జిల్లా

  • రెడ్డిపల్లి గ్రామంలో గ్రామసభ నిర్వహించిన డిఎస్పి గారు
  • మహిళలు, ప్రజల భద్రత ముఖ్య ప్రాధాన్యత అంశంగా విస్తృతంగా అవగాహన కల్పన డి.ఎస్.పి

మహిళలు,ప్రజల భద్రత ముఖ్య ప్రాధాన్యత గా బావించి గ్రామసభల ద్వారా ప్రజలకు అవగాహన చేపట్టామని పుట్టపర్తి డిఎస్పి విజయ్ కుమార్ సూచించారు. శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు శనివారం రాత్రి నల్లమడ మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో వారధి ప్రోగ్రాం అనే కార్యక్రమం చేపట్టారు.
నేరాలు పై ప్రజలకు డిఎస్పి గారు అవగాహన కల్పించారు.మహిళ భద్రత,మాదక ద్రవ్యాలు వలన కలిగే దుష్ప్రభావలు. సైబర్ సేఫ్టీ. రోడ్డు సేఫ్టీ. శక్తీ యాప్, డిజిటల్ మోసాలు మహిళలు, బాలికలపై జరిగే నేరాలు ,
డ్రంక్ అండ్ డ్రైవ్, బాల్య వివాహాలు ,ఫోక్సో కేసుల , గుడ్ టచ్ & బ్యాడ్ టచ్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలు, ఈవ్ టీజింగ్ లపై ప్రజలకు వివరించారు. గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఉండాలని ఎలాంటి ఫ్యాక్షన్ గొడవలకు వెళ్లకూడదని తమ పిల్లలను బాగా చదివించుకొని ఉన్నత విద్యావంతులు చేసుకోవాలని సూచించారు. కొత్త వ్యక్తులు ఎవరైనా మీ ప్రాంతంలో సంతరిస్తున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100,112 కు సమాచారం అందించాలని, ఈ సందర్భంగా డిఎస్పీ తెలియజేశారు, ఈ కార్యక్రమంలో SI సతీష్, నల్లమడ, మరియు గ్రామస్తులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Posted Under AP
Editor