Latest Posts

దాడితోటలో విద్యుత్ సెగ: అగ్నిప్రమాదంలో 220 మామిడి మొక్కలు దగ్ధం.. కన్నీరుమున్నీరవుతున్న రైతు!

దాడితోట గ్రామంలో రైతుకు భారీ నష్టం
దాడితోట గ్రామానికి చెందిన రైతు దిద్దుకుంట రామ్‌చంద్ర రెడ్డి గారి మామిడి తోటలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు రెండున్నర లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు రైతు తెలిపారు.
సర్వే నెంబర్ 213లో ఉన్న 2 ఎకరాల పొలంలో సాగు చేస్తున్న మామిడి తోటలో సుమారు 220 మామిడి మొక్కలు కరెంట్ షాక్ కారణంగా మంటలు చెలరేగి కాలిపోయాయి. ఈ ప్రమాదంలో పూతలు, కాయలు మాత్రమే కాకుండా డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ, పైపులు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి.
దిగుబడి ఆశించిన సమయంలో జరిగిన ఈ ఘటనతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి నష్టాన్ని అంచనా వేసి తగిన నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Posted Under AP
Editor