Latest Posts

పుల్వామా అమరవీరులకు ఘన నివాళి: దాడి తోట గ్రామంలో జవాన్ల త్యాగాలను స్మరించుకున్న బీజేపీ నాయకులు!

2019లో జరిగిన Pulwama attack లో దేశ రక్షణలో తమ ప్రాణాలు అర్పించిన అమర వీర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ దాడి తోట గ్రామంలో ఘన నివాళుల కార్యక్రమం నిర్వహించబడింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులకు పుష్పాంజలి ఘటిస్తూ వారి సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు గారు, తాడిమరి బీజేపీ మండల అధ్యక్షుడు దేవర రామ్మోహన్ గారు, ధర్మవరం రూరల్ అధ్యక్షుడు గొట్లు రు చంద్ర గారు, వైస్ ఎంపీపీ కృష్ణమనాయుడు గారు, ప్రధాన కార్యదర్శి ఆనంద్ గారు, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు జి. గంగులప్ప గారు, వన్ను రెడ్డి గారు, జిల్లా జనరల్ సెక్రటరీ సాకే ఓబులేసు గారు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నాగార్జున గారు, జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి రమణయ్య గారు, మండల ఉపాధ్యక్షుడు రమణ గారు, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పోతలయ్య గారు, రామాంజనేయులు గారు, రంగయ్య గారు, కుల్లాయప్ప గారు, గంగరాజు గారు తదితరులు పాల్గొన్నారు.
అమర జవాన్ల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని, దేశభక్తి స్పూర్తిని అందరికీ కలిగిస్తాయని నాయకులు పేర్కొన్నారు. 💐🇮🇳

Posted Under AP
Editor