శ్రీ సత్య సాయి జిల్లా……
- తిమ్మమ్మ మర్రిమాను ఆలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ…
- శివరాత్రి మహోత్సవం సందర్భంగా వి.వి.ఐ.పిల రాక, భక్తులకు అనుగుణంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా
పటిష్టమైన భద్రత ఏర్పాట్లు… - డ్రోన్, సిసి కెమెరాలతో పాటు నైట్ విజన్ డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా…
ఉత్సవాలకు పోలీస్ శాఖ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం…… - భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం…..
- లేపాక్షి, హేమావతి, తిమ్మమ్మ మర్రిమాను, కాటి కోటేశ్వర ఆలయాల వద్ద పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు పకడ్బందీగా చేపడతాం……
- జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు…
శ్రీ సత్యసాయి జిల్లా తిమ్మమ్మ మర్రిమాను ఆలయాన్ని జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు శనివారం సందర్శించి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం శివరాత్రి మహోత్సవం పురస్కరించుకొని భద్రత ఏర్పాట్లకు సంబంధించి ఎస్పీ గారు, కదిరి, డిఎస్పీ శివన్నారాయణ స్వామి, తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. మూడరోజులు పాటు జరిగే ఈ ఉత్సవాల కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని జిల్లా ఎస్పీ గారు తెలియజేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా భారీకేడింగ్, పార్కింగ్ తదితర ఏర్పాట్లను సమీక్షించి సూచనలు చేశారు.
ఈరోజు సాయంత్రం నుంచి భద్రత ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, అన్ని విభాగాలతో సమన్వయం చేసుకొని ఎటువంటి ఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సీసీ కెమెరాలు, డ్రోన్, నైట్ విజన్ డ్రోన్ల ద్వారా నిఘా ఉంచుతామన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ గారు స్పష్టం చేశారు. అన్ని శివ క్షేత్రాలలో శివరాత్రి పండుగ సందర్భంగా పోలీస్ శాఖ భద్రతపరంగా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ గారు తెలియజేశారు. జిల్లా ఎస్పీ గారి వెంట కదిరి డిఎస్పీ శివన్నారాయణ స్వామి, సిఐలు నిరంజన్ రెడ్డి ,నాగేంద్ర , ఎస్ఐలు, నరసింహులు ,మక్బూల్ సుమతి ,కృష్ణమూర్తి సిబ్బంది ఉన్నారు.
