Latest Posts

తాడిమర్రిలో ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదిక: రూ. 9.29 కోట్ల పనులపై ఆడిట్.. రూ. 62,443 రికవరీకి ఆదేశం!

తాడిమర్రిలో ఉపాధి హామీ పనులపై 19వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహణతాడిమర్రి మండలం లో మండల పరిషత్ కార్యాలయం నందు 19వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమంలో భాగంగా ప్రజావేదిక నిర్వహించబడింది.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 01-04-2024 నుండి 31-03-2025 వరకు చేపట్టిన 743 పనులపై మొత్తం రూ. 9,29,85,746 వ్యయానికి సంబంధించిన వివరాలను సమగ్రంగా పరిశీలించారు. ఈ తనిఖీలలో రూ. 62,443 రికవరీ చేయాలని ఆదేశాలు జారీ చేయబడినవి.
ఈ ప్రజావేదికకు ప్రిసైడింగ్ అధికారిగా డ్వామా పీడీ విజయ్ ప్రసాద్ గారు వ్యవహరించగా, ఏపిడీ వెంకటాచలపతి గారు, ఎంపీడీవో రంగారావు గారు, అంబుడ్స్‌మెన్ శివారెడ్డి గారు, అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి నాగేశ్వరరావు గారు హాజరయ్యారు.
అలాగే ఏపీవోలు అనిల్ కుమార్ రెడ్డి, సంజీవరెడ్డి, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు అశోక్ కుమార్ రెడ్డి, సాయి కృష్ణ, ఎస్‌ఆర్‌పీ భాస్కర్, డీఆర్‌పీలు భగవాన్, రవి అశోక్ కుమార్, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మరియు ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.
సామాజిక తనిఖీల ద్వారా పారదర్శకత, బాధ్యతాయుత వ్యవహారం మరింత బలోపేతం అవుతుందని అధికారులు తెలిపారు.

Posted Under AP
Editor