Latest Posts

తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద బోల్తా పడిన ట్రాక్టర్: తృటిలో తప్పిన ప్రాణాపాయం!

తాడిమర్రి మండలంలోని చిల్ల కొండయ్య పల్లి గ్రామ సరిహద్దులో శుక్రవారం ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. బోల్తా పడిన ట్రాక్టర్ జమ్మలమడుగు గ్రామానికి చెందినదిగా తెలిసింది.
సమాచారం ప్రకారం, జమ్మలమడుగు ప్రాంతం నుండి రైతులకు పేడ ఎరువు సరఫరా చేసి తిరుగు ప్రయాణంలో ఉండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ట్రాక్టర్ రోడ్డుపక్కకు దిగి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడినట్లు గ్రామస్తులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక గ్రామస్తులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. జెసిబి యంత్రాన్ని పిలిపించి బోల్తా పడిన ట్రాక్టర్‌ను పైకి లేపి రహదారిని శుభ్రం చేశారు.
పెద్ద ప్రమాదం తప్పినందుకు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలు నడపాలని స్థానికులు సూచించారు.

Posted Under AP
Editor