Latest Posts

చిల్లవారిపల్లిలో వైభవంగా శ్రీ కాటకోటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు: వివాదాలకు స్వస్తి పలికి సామరస్యంగా వేడుకలు – ఏర్పాట్లను పరిశీలించిన పరిటాల శ్రీరామ్

తాడిమర్రి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిమరి మండలంలో ప్రసిద్ధి చెందిన చిల్లవారిపల్లి శ్రీ కాటకోటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈసారి సామరస్యపూర్వక వాతావరణంలో జరుగుతాయని ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ తెలిపారు. తాడిమర్రి మండలం చిల్లవారిపల్లి సమీపంలోని క్షేత్రాన్ని ఆయన సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా ఈ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. గత కొన్నేళ్లుగా పూజా విధానాలపై మరియు గుర్రపు ప్రతిమలపై వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ఈసారి ముందస్తుగా స్వామి వారి కాపులు అయినటువంటి జాన గాని గంగిరెడ్డి చిల్లా అంకే నల్లపు దాసగానిపల్లి అన్ని వర్గాల ప్రతినిధులతో చర్చలు జరిపి ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పోలీసుల సమక్షంలో సామరస్యపూర్వకంగా ఉత్సవాలు జరగాలని అందరూ అంగీకరించినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక విడుదల చేయడం జరిగింది పూజా కార్యక్రమాలు 15 :02: 2026 ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి 11 గంటల వరకు శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకములు ప్రసాద వియోగము రాత్రి జాగరణ మరియు అక్కమ్మ గారి కొలువు జరుగును 16:02:2026 సోమవారం ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు స్వామివారికి అభిషేకములు తీర్థ ప్రసాద వినియోగము మధ్యాహ్నం 12 గంటల నుండి శ్రీవారు గుర్రపు ప్రతిమలతో భక్తులతో అగ్నిగుండ ప్రవేశం జరుగునని ఎండోమెంట్ అధికారి నరసింహారాజు తెలియజేయడం జరిగింది
ఉత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు డిఎస్పీ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సీఐ సునీత, ఎస్సై కృష్ణవేణి యాదవ్ సిబ్బందితో కలిసి క్షేత్ర పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
భద్రతా చర్యల వివరాలను డిఎస్పీ హేమంత్ కుమార్, పరిటాల శ్రీరామ్‌కు వివరించినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, జనసందోహ నియంత్రణ, ప్రత్యేక పహారా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. అలాగే భక్తులకు ఎటువంటి ఆహార ఇబ్బందులు కలగకుండా ఆహార ఇబ్బందులు కలగకుండా భోజనం ఏర్పాట్లు నిత్య అన్నదాన కమిటీ చైర్మన్ అమర్ నాథ్ రెడ్డి వైస్ చైర్మన్ వైఎం శ్రీనివాస్ రెడ్డి అన్ని ఏర్పాట్లు చేసినట్లు పరిటాల శ్రీరామ్ కు తెలియజేయడం జరిగింది
ఈ నెల 16న జరిగే గుర్రాపు ప్రతిమల ఉత్సవం, భక్తుల అగ్నిగుండ ప్రవేశం కార్యక్రమం విశేషంగా ఉంటుందని తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవాలని పరిటాల శ్రీరామ్ కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ కూచి రాము ఎక్స్ ఎంపీపీ కొడిదేల రాజశేఖర్ మద్దినేని రమణ ఆలం సూరి శ్రీనివాస్ రెడ్డి ముసుగు శ్రీనివాసులు తొట్టి గంగాధర్ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది వన్ ఆహ్వాన పత్రిక విడుదల చేసిన ధర్మవరం టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ ఫోటో టు స్వామివారిని దర్శించుకున్న పరిటాల శ్రీరామ్ నాయకులు కార్యకర్తలు భక్తులు ఫోటో త్రి భద్రత ఏర్పాట్లను వివరిస్తున్న డిఎస్పి హేమంత్ కుమార్ ఫోటో ఫైవ్ సిక్స్ గజాగుండం మరియు అగ్నిగుండం పరిశీలిస్తున్న పరిటాల శ్రీరామ్

Posted Under AP
Editor