విద్యార్థినిలకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం మండల పరిధిలోగల కేజీబీవీ పాఠశాలను జిసిడివో అనిత గారు తనిఖీ చేశారు విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని కేజీబీవీ స్కూల్ ఎస్ ఓ లక్ష్మికి శ్రీ సత్య సాయి జిల్లా జిసిడివో అనిత సూచించారు. కేజీబీవీ పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షల తీరును ఆమె పర్యవేక్షించారు. అనంతరం విద్యార్థులకు ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలు విద్య వైద్యం భోజన ఇతర సౌకర్యాలపై ఎస్ఓను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఇస్తున్న పాలు కూరగాయలు గుడ్లు ఇతర వస్తువులు నాణ్యంగా ఉన్నాయా లేదా అని పరిశీలించారు. అనంతరం పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేశారు. విద్యార్థినిలకు సకాలంలో అల్పాహారంతో పాటు భోజనం వడ్డించాలని ఎస్ఓను ఆదేశించారు. అదేవిధంగా పరీక్షలలో మంచి ఫలితాలు కూడా సాధించాలని సూచించారు. విద్యార్థినీలతో అక్కడున్నటువంటి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు విద్యార్థినిలకు నాణ్యమైన భోజనాన్ని వడ్డించకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కేజీబీవీ పాఠశాలలో జి.సి.డి.వో తనిఖీ: “విద్యార్థినిలకు నాణ్యమైన భోజనం అందించకపోతే కఠిన చర్యలు!”
