Latest Posts

శ్రీ కాటి కోటేశ్వర స్వామి ఆలయంలో నిత్య అన్నదానానికి భారీ విరాళం: ధనుంజయ నాయుడు ఉదారత

తాడిమర్రి ఫిబ్రవరి10:-(YES9TV)నిత్య అన్నదాన సేవకు భారీ చేయూత – రూ.2 లక్షల విరాళం అందించిన తెలుగుదేశం పార్టీ పార్నపల్లి సీనియర్ నాయకులు జొన్నగడ్డల ధనుంజయ నాయుడు
తాడిమర్రి, ఫిబ్రవరి 10 (YES9TV):
తాడిమర్రి మండలంలోని చిల్లవారిపల్లె గ్రామ సమీపంలో ఉన్న ప్రసిద్ధ పురాతన శ్రీ కాటి కోటేశ్వర స్వామి ఆలయంలో ప్రారంభించిన నిత్య అన్నదాన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ సేవా కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పార్నపల్లి సీనియర్ నాయకులు జొన్నగడ్డల ధనుంజయ నాయుడు గారు ముందుకు వచ్చి రూ.2,00,000/- (రెండు లక్షల రూపాయలు) విరాళంగా అందజేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
భక్తులకు నిత్య అన్నదాన సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో దాడితోట గ్రామానికి చెందిన గ్రామస్తులు, భక్తులు కలిసి నిత్య అన్నదాన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి చైర్మన్‌గా నొస్సాం అమర్నాథ్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా వై.ఎం. శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కమిటీ ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆలయానికి విచ్చేసే భక్తులకు అన్నదానం అందించనున్నారు.
ఈ సందర్భంగా జొన్నగడ్డల ధనుంజయ నాయుడు మాట్లాడుతూ,
“శ్రీ కాటి కోటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల కోసం ప్రారంభించిన నిత్య అన్నదాన కార్యక్రమం ఎంతో అభినందనీయం. అన్నదానం మహాదానం. ఈ పవిత్ర సేవ నిరంతరంగా కొనసాగాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమానికి నా వంతు సహకారం అందించడం ఆనందంగా ఉంది” అని తెలిపారు.
అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దాతలు అందించిన విరాళాల నిధులతో, కమిటీ ఆధ్వర్యంలో ఆలయ ఆవరణలో రోడ్డు విస్తరణ, పరిశుభ్రత పనులు చేపట్టి జెసిబి వాహనాల సహాయంతో పూర్తి చేశారు.
గ్రామ పెద్దలు మాట్లాడుతూ జొన్నగడ్డల ధనుంజయ నాయుడు గారు అందించిన విరాళం నిత్య అన్నదాన కార్యక్రమానికి మరింత బలం చేకూర్చిందని పేర్కొంటూ, ఆయన సేవాభావాన్ని ప్రశంసించారు. గ్రామస్తులు, దాతల సమిష్టి సహకారంతో చేపట్టిన ఈ సేవా కార్యక్రమం భక్తుల ప్రశంసలను అందుకుంటోంది.

Posted Under AP
Editor