వంద ఎకరాల్లో సామూహిక పశుగ్రాసం పెంపకం…

అనంతపురం జిల్లా రాయదుర్గం

* వంద ఎకరాల్లో సామూహిక పశుగ్రాసం పెంపకం
* పశువులను కాపాడుకోవడానికి ముందస్తు చర్యలు
* ఎమ్మెల్యే, కాలవ శ్రీనివాసులు

ఎల్ నీ నో ప్రభావం వల్ల అనేక రాష్ట్రాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని రాయదుర్గం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు తెలిపారు.

అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం వేపరాళ్ల
చెరువులో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 100 ఎకరాల్లో సామూహిక పశుగ్రాసం సాగు కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు జె డి ప్రేమ్ చంద్ తో కలిసి మంగళవారం గడ్డి విత్తనాలు చల్లి లాంఛనంగా ప్రారంభించారు.
రాష్ట్రంలోనే తొలిసారిగా అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని వ్యాపారాల చెరువులో పశుగ్రాసం పెంపకాన్ని ప్రారంభించినట్లు కాలవ పేర్కొన్నారు. చెరువులో ట్రాక్టర్ సహాయంతో పశుగ్రాసం విత్తనాలను విత్తారు. రాష్ట్రంలో మనుషులతో పాటు పశువులను కాపాడాలని ముందస్తు ఆలోచనలతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, నేను కలిసి జెడి, డీడీలను కలిసి పశువులను పోషించుకోవడానికి పశుగ్రాసం సాగు చేయాలని ముందస్తు చర్యలు చేపట్టామన్నారు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్న పశువులకు మేత అందించాలని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
రాయదుర్గం నియోజకవర్గం లో 58 వేల పశువులు, 1.50 లక్షల గొర్రెలు ఉన్నాయని, వాటికి పశుగ్రాస అందించాల్సిన బాధ్యత రైతులపై ఉందన్నారు.
1995- 2004 లో తీవ్ర కరువు కాటకాలు నెలకొన్న సందర్భంగా చంద్రబాబు నాయుడు కృష్ణ, గుంటూరు జిల్లాల నుంచి అనంతపురం జిల్లాకు పశుగ్రాసం తెప్పించి పశువులను కాపాడారన్నారు.
జిల్లాలోని పీఏబీఆర్, కోడుమూరు వద్ద పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వేపరాళ్ల చెరువులో రెండు వేల కిలోల గడ్డి విత్తనాలు సాగు చేస్తున్నామన్నారు. పశుగ్రాసం పెరిగితే దాని విలువ రూ. 1.25 కోట్లు ఉందన్నారు.
ఈ చెరువు ద్వారా చుట్టూ ఉన్న గ్రామాల్లోని 3000 పశువులను నీతో అందించి కాపాడుకోవడానికి అవకాశం ఉందన్నారు.
ఏడాది తుంగభద్ర జలాశయానికి ఆశించనంత నీరు లేకపోవడంతో రైతులు వరి పంట పెట్టవద్దని సూచించారు. ఆరుతడి పంటలు సాగు చేసుకుని పశు పోషణలో రైతులు ముందుకు రావాలన్నారు.
నీటి వసతి గల రైతులకు హరిత గోపాల పథకం ద్వారా ఒక ఎకరాల్లో పశుగ్రాసం సాగు చేస్తే పశుసంవర్ధక శాఖ రూ. 56 వేల 100% సబ్సిడీపై ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు.

Posted Under AP
Editor