Latest Posts

శ్రీ కాటి కోటేశ్వర స్వామి ఆలయంలో ‘నిత్య అన్నదానం’ ప్రారంభం: భక్తుల కష్టాలు తీర్చిన దాడితోట గ్రామస్థుల సంకల్పం

తాడిమర్రి ఫిబ్రవరి10:-(YES9TV)శ్రీ కాటి కోటేశ్వర స్వామి ఆలయంలో నిత్య అన్నదానానికి శ్రీకారం
తాడిమర్రి మండలంలోని చిల్లవారిపల్లె గ్రామ సమీపంలో ఉన్న ప్రసిద్ధ పురాతన శ్రీ కాటి కోటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు నిత్య అన్నదాన సదుపాయం లేక గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితిని గమనించిన దాడితోట గ్రామానికి చెందిన గ్రామస్తులు, భక్తులు కలిసి నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ క్రమంలో గ్రామస్తులు సమిష్టిగా నిత్య అన్నదాన కమిటీని ఏర్పాటు చేశారు. నిత్య అన్నదాన కమిటీకి చైర్మన్‌గా నొస్సం అమర్నాథ్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా వై.ఎం. శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కమిటీ ఆధ్వర్యంలో ఇకపై ప్రతిరోజూ ఆలయానికి విచ్చేసే భక్తులకు అన్నదానం అందించాలనే సంకల్పంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అలాగే ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దాతలు అందించిన విరాళాల నిధులతో, చైర్మన్ నొస్సం అమర్నాథ్ రెడ్డి గారి ప్రత్యేక చొరవ, సహకారంతో గుడి ఆవరణలో రోడ్డు విస్తరణ, పరిశుభ్రత పనులు చేపట్టారు. జెసిబి వాహనాల సహాయంతో ఈ పనులను పూర్తిచేసి ఆలయ పరిసరాలను శుభ్రంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ “అన్నదానం మహాదానం” అని, శ్రీ కాటి కోటేశ్వర స్వామి కృపతో ఈ నిత్య అన్నదాన కార్యక్రమం నిరంతరంగా కొనసాగాలని ఆకాంక్షించారు. గ్రామస్తులు, దాతల ఐక్యతతో చేపట్టిన ఈ సేవా కార్యక్రమాలు భక్తుల ప్రశంసలు పొందుతున్నాయి

Posted Under AP
Editor