అనంతపురం జిల్లా,
రాయదుర్గ నియోజకవర్గం•••••
బంగారు దుకాణంలో చోరీ
6 లక్షలు విలువచేసే వెండి ఆభరణాలతో పరార్
సీసీ కెమెరాల్లో రికార్డయిన చోరీ దృశ్యాలు
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం బళ్లారి రోడ్ లోని సయ్యద్ జ్యువెలర్స్ లో చోరీ. రూ. ఆరు లక్షల విలువచేసే వెండి ఆభరణాలతో దుండగులు పరార్.
తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఐదు మంది గుర్తు తెలియని దుండగులు బంగారు దుకాణం ప్రధాన ద్వారం బిగాలను తెరిచి లోనికి ప్రవేశించారు. ముఖాలకు మాస్కులు ధరించి ఉండటంతో గుర్తుపట్టని పరిస్థితి. దాదాపు అరగంట పాటు దుకాణాన్ని జల్లెడ పట్టారు. దుకాణంలో చోరీ జరిగిన దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. దుకాణంలోని సేఫ్టీ లాకర్ తెరిచేందుకు దుండగులు ప్రయత్నించి విఫలమయ్యారు.
బంగారు ఆభరణాలన్నీ సేఫ్టీ లాకర్లు లో ఉండటంతో తప్పిన పెను నష్టం.
సయ్యద్ జ్యువెలర్స్ యజమాని హారున్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బైట్స్. సయ్యద్ జ్యువెలర్స్ యజమాని, హారున్, రాయదుర్గం
