తాడిమర్రి ఫిబ్రవరి 9( YES 9TV) చిల్ల కొండయ్యపల్లి గ్రామంలో ప్రమాదకర స్థితిలో 11 కె.వి విద్యుత్ స్తంభాలు
అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్
సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్ల కొండయ్యపల్లి గ్రామంలో పొలాల మోటార్లకు వెళ్లే 11 కె.వి విద్యుత్ స్తంభాలు గత ఆరు సంవత్సరాలుగా ప్రమాదకర స్థాయిలో వంగి పడిపోయే పరిస్థితిలో ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ స్తంభాలు ఎప్పుడైనా కూలిపడే ప్రమాదం ఉండటంతో పొలాలకు వెళ్లే రైతులు, కూలీ రైతులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో విద్యుత్ స్తంభాలు పడిపోతే ప్రాణనష్టం జరిగే అవకాశముందని గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పలు మార్లు సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రమాదాన్ని నివారించేందుకు వెంటనే కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని, ఉన్న స్తంభాలను మరమ్మతులు చేయాలని రైతులు అధికారులను కోరుతున్నారు.
తాడిమర్రిలో ప్రమాదఘంటికలు: వంగిపోయిన విద్యుత్ స్తంభాలు.. భయం గుప్పిట్లో రైతులు!
