కదిరి
ఫిబ్రవరి 9
- జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలి రాంజీ చట్టాన్ని రద్దు చేయాలి
- శ్రీ సత్య సాయి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి M వేమయ్య యాదవ్ కేంద్రప్రభుత్వాన్నిచర్యను తీవ్రంగా విమర్శించారు
కదిరి మండల ప్రజా పరిషత్ ఎంపీడీవో కార్యాలయం వద్ద సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా సమైక్య ఆధ్వర్యంలో ర్యాలీతో పాటు ధర్నా నిర్వహించారు
ఎంపీడీవో పోలప్ప గారికి ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని కొనసాగిస్తూ, కుటుంబానికి సంవత్సరానికి 200 రోజులు పని కల్పించి, రోజు కూలి 800 రూపాయలు ఇవ్వాలని . వ్యవసాయ పనులు లేని సమయంలో గ్రామీణ పేదలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లకుండా నివారించుటకు ఉపయోగపడుతున్న ఆయన మాట్లాడారు
ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బి కదిరప్ప మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించుటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఈనెల 11 నుండి జరుగునున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, రాష్ట్రాలపై అధిక ఆర్థిక భారం పడుతున్న జీ రాం జీ పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మధు నాయక్ చలపతినాయుడు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉప ప్రధాని కార్యదర్శి రమణ జిల్లా ఉపాధ్యక్షులు వెల్డింగ్ వెంకటనారాయణ సిపిఐ నాయకులు శ్రీనివాసులు హాసన్
పట్టణ కార్యదర్శి ఇలియాకత్ మండలాల కార్యదర్శులు తలుపులఈశ్వరయ్య గాండ్లపెంటశ్రీ రాములు నాయుడు నల్లమాడ స్వామి తనకల్లు రవీంద్ర ఎన్పీ కుంట అంజన్ రెడ్డి ఆమడగూరు బాబు సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా సమైక్య నాయకులు మహిళలు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు.
