Latest Posts

రాయదుర్గం అభివృద్ధికి రూ. 63 కోట్లు: హగరి నదిపై వంతెన నిర్మాణానికి కాలువ శ్రీనివాసులు భూమిపూజ

అనంతపురం జిల్లా,
రాయదుర్గం నియోజకవర్గం•••••

  • రూ. 63 కోట్లతో అభివృద్ధి పనులు
  • రూ. ఆరు కోట్లతో కనేకల్ మాల్యం హగరి నదిపై వంతెన నిర్మాణానికి భూమి పూజ

రాయదుర్గం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో రూ. 63 కోట్లతో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ రహదారుల అభివృద్ధి పనులు చేపట్టినట్లు ప్రభుత్వ విప్, రాయదుర్గం శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు.

కనేకల్ మండలం ఎన్ హనుమాపురం గ్రామంలో రూ. 15 లక్షల ఉపాధి హామీ నిధులతో మూడు చోట్ల నిర్మించిన సిసి రోడ్లను అట్టహాసంగా ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని లాలు స్వామి పీర్లచావిడిలో తూకా భారంతో చక్కెర చదివింపులు చేసి ఎన్నికల మొక్కును తీర్చుకున్నారు.
అదేవిధంగా మాల్యం గ్రామంలో ప్రభుత్వం రైతులకు నూతనంగా మంజూరు చేస్తున్న పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు.
రూ.6 కోట్ల నాబార్డ్ నిధులతో కనేకల్- మాల్యం హగరి నదిపై 236 మీటర్ల వంతెన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన 20 నెలల్లో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 63.12 కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. పల్లె పండుగ ఒకటి కింద రూ. 18 కోట్ల నిధులతో 477 సిమెంట్ రోడ్లను నిర్మించినట్లు తెలిపారు. పల్లె పండుగ రెండవ పథకం కింద రూ.1.94 కోట్ల నిధులతో బీటీ రోడ్లను నిర్మించినట్లు తెలిపారు. ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు నాబార్డ్, కేంద్ర ప్రభుత్వ శాశ్వత అభివృద్ధి నిధులతో సిమెంట్ రహదారులు పలు వంతెనలను నిర్మించినట్లు తెలిపారు.

బైట్స్. కాలవ శ్రీనివాసులు, ప్రభుత్వ విప్, రాయదుర్గం శాసనసభ్యులు.

Posted Under AP
Editor