శ్రీ సత్యసాయి జిల్లా నల్లమడ మండలం మండల పరిధిలో గల గోపేపల్లి గ్రామ సచివాలయాన్ని ఈరోజు ఎమ్మెల్యే సింధూర రెడ్డి గారు రైతుకి పట్టాదారు పాసు బుక్కులను అందజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సింధూర రెడ్డి గారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు సరిగా పని చేయకపోవడం వలన ప్రజలకు రీ సర్వేలో సమస్యలు ఎక్కువగా వచ్చినాయని మీ సమస్యలను మేము రెండు నెలల్లో పరిష్కరిస్తామని చెప్పినారు అలాగే రాగానే పల్లి తండా కి సిమెంట్ రోడ్డు సిమెంట్ రోడ్డు కోసం తండావాసులు అర్జీ రూపంలో ఎమ్మెల్యే మేడంకి ఇచ్చినారు సిమెంట్ రోడ్డు పొడవు 183 మీటర్లు దాని ఖర్చు 8.5 లక్షలు ఉంటుంది ఈసారి బడ్జెట్ సమావేశాలలో సిమెంట్ రోడ్డు కు కావలసిన నిధులను సమకూర్చుకొని మీకు రోడ్డు తప్పకుండా శాంక్షన్ చేస్తామని హామీ ఇచ్చినారు ఎమ్మార్వో గారు మాట్లాడుతూ గోపేపల్లి గ్రామంలో నుండి ప్రజలు ఎక్కువగా అర్జీలు ఇచ్చినారు అందులో ఎక్కువగా మా భూములు చుక్కల భూములో పడినాయి మాకు వన్ బీ లు రావడం లేదు దయచేసి మా సమస్యలను పరిష్కరించగలరు అని ఉన్నాయి వీటన్నిటినీ మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినారు ఆర్డిఓ మేడం గారు మాట్లాడుతూ కొత్త పాసుబుక్కుల్లో ఎటువంటి తప్పులు లేకుండా మీకు రెండు నెలల్లో అందజేస్తామని ఇప్పుడు వచ్చిన కొత్త పాసుబుక్కుల్లో క్యూఆర్ కోడ్ కూడా ఉందని మీరు సరిచూసుకోవచ్చునని మీ సమస్యల కోసం మేము జెసి గారికి కూడా లెటర్ కూడా పెడుతున్నాము మీ సమస్యలను ఇంకో రెండు నెలల్లో పూర్తి చేస్తాము అని చెప్పినారు గోపేపల్లి గ్రామానికి చెందిన ఎం నాగేందర్ రెడ్డి అనే రైతు మాట్లాడుతూ అధికారులు వస్తారు చేస్తామని చెబుతారు గ్రామ సభలు పెడతారు కానీ ప్రజలకు ఎటువంటి న్యాయం జరగలేదని రైతు ఇచ్చిన పాత పాసుబుక్ లో సర్వే నెంబర్లు చెప్పినా కూడా గతంలో ఉన్న అధికారులు సరి చేయకుండా ప్రజలందరికీ ప్రతి రైతుకి ఇబ్బంది పెట్టినారు అని అన్నారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సింధూర రెడ్డి గారు మాజీ మంత్రి డాక్టర్ శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డి గారు నల్లమాడ ఎమ్మార్వో గారు ఆర్డీవో మేడంగారు గోపేపల్లి కి సంబంధించిన దాదిరెడ్డి విశ్వనాథ రెడ్డి గారు డీలర్ దాదిరెడ్డి వెంకటరామి రెడ్డి గారు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు
రీ-సర్వే సమస్యలకు చెక్: గోపేపల్లిలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సింధూర రెడ్డి!
