Latest Posts

ముదిగుబ్బలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన: అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులు అర్పించిన చిగురుపాటి కుమారస్వామి

ముదిగుబ్బలో బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు !!!

ముదిగుబ్బ ఫిబ్రవరి 04 :-(YES 9 TV) :-

ముదిగుబ్బ మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలిలో స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు, శ్రీ సత్య సాయి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు సోమల ప్రకాష్ నాయుడు తో కలిసి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమార్ స్వామి , ముదిగుబ్బలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుమారస్వామి మాట్లాడుతూ, స్థానికంగా భారతీయ జనతా పార్టీ క్రమంగా బలపడుతోందని, ఇంకా మెరుగైన స్థాయికి వెళుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి శరత్ కుమార్ రెడ్డి, నాగరాజు ,గంగాధర ,పసుపులేటి వెంకటేష్, అశోక్ కుమార్ ,జాస్తి అశోక్ ,నారాయణ జనార్ధన ,పెద్ద రాములు, లక్ష్మి బాయ్ ,మల్లికార్జున తదితర నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Posted Under AP
Editor