ఆవు లేదు.. పాలు లేదు… నెయ్యి ఎలా వచ్చింది స్వామి
ఆవు లేదు.. పాలు లేదు… నెయ్యి ఎలా వచ్చింది స్వామి అంటూ పలమనేరు శాసనసభ్యులు అమరనాథ రెడ్డి వైసీపీ నేతలకు వ్యంగ్యాస్త్రలను సంధించారు. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారం అంశంపై మహా పాపం నిజం పేరిట ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పలమనేరులో కూటమి నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని టవర్ క్లాక్ సర్కిల్ నుంచి గంగమ్మ గుడి మీదుగా స్థానిక కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయం వరకు ర్యాలీ చేశారు. అనంతరం ఆలయంలో శుద్ది అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం ఆలయం వెలుపల మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు… ప్రపంచంలోనే అత్యధిక మంది నమ్మే దైవం కలియుగ వెంకటేశ్వర స్వామి అని ఆయనకు సమర్పించే ఎంతో విలువైనది కావడంతో పాటు ప్రసిద్ధి చెందిందన్నారు. అటువంటి మహా ప్రసాదానికి వైకాపా ప్రభుత్వ హయాంలో మహాప్రచారం జరిగిందని అన్నారు. గతంలో తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తిరుపతి స్వామి వారి లడ్డు వ్యవహారంలో కల్తీ జరుగుతోందని అనుమానం వ్యక్తం చేసామని, ఆనాడు తాము చెప్పినట్లుగానే నేడు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తు సంస్థ నిగ్గు తేల్చిందన్నారు. అప్పటి టీటీడీ పాలకవర్గం నిబంధనలకు పాతర వేసి పాల సేకరణే చేపట్టని డొల్ల సంస్థకు నెయ్యి సరఫరా అనుమతులు ఇచ్చారన్నారు. పాల సేకరణ చేయని డైరీలు నెయ్యి ఎలా సరఫరా చేసాయో అర్థం కావడం లేదని , భగవంతుడికి జరిగిన అపచారంపై విచారణ వ్యక్తం చేయకపోగా వైకాపా నేతలు నోటికొచ్చిందల్లా మాట్లాడుతుండడాన్ని బట్టి చూస్తే భగవంతుడిపై, ధర్మంపై వారికున్న చిత్తశుద్ధి అర్థమవుతుందని అన్నారు. కల్తీ నెయ్యి కాదని వాదించే వైవి సుబ్బారెడ్డి ఆయన పీఏ ఖాతాలోకి అ సంస్థల నుంచి కోట్ల రూపాయలు ఎలా వచ్చాయో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇక వ్యవహారంపై విమర్శలు చేసే వైకాపా నేతలు జగన్ హిందువని ధైర్యంగా చెప్పగలరా అని సవాల్ విషయాలు. గత ప్రభుత్వంలో అన్ని రకాల కల్తీలతో కోట్లు దోచుకున్నారని భగవంతుని వద్ద దోచుకోవడం బాధాకరమన్నారు. వెంకటేశ్వర స్వామికి ఎవరైనా అన్యాయం చేస్తే వారికి పుట్టగతులు ఉండవని గుర్తించాలని పేర్కొన్నారు. ఇప్పటికైనా దేవునిపై భక్తి ఉంటే జరిగిన అపచారానికి ప్రజలకు క్షమాపణ చెప్పి చేసిన తప్పులు ఒప్పుకుంటే ఆ దేవుడు క్షమిస్తాడన్నారు. ఇకనైనా హిందువుల మనోభావాలను దెబ్బతీసే పనులు చేయొద్దని హితవు పలికారు.ఈ నిరసన కార్యక్రమంలో సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ, పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం గౌడ్,గిరి,ఖాజా, నాగరాజు, కృష్ణమూర్తి గౌడ్, రూపేష్, కిరణ్, బి ఆర్ సి కుమార్, శ్రీధర్, మదన్, భాస్కర్ యాదవ్, మురళీకృష్ణ, వెంకటరమణ, సుధాకర్, పూల చైతన్య, నదీమ్, గోవర్ధన్, చిన్ని, కోటి, సుబ్రహ్మణ్యం, మంజునాథ్, వి రప్ప, మంజులా రెడ్డి, సెల్వరాజ్,పార్టీ మండల అధ్యక్షులు కిషోర్ గౌడ, రాంబాబు, సోమశేఖర్ గౌడు,కుట్టి, నాగరాజు రెడ్డి, ఆనంద, జనసేన అధ్యక్షులు దిలీప్ కుమార్, బీజేపీ నాయకులు శరవణ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
