ఏపీ సూపర్ 2026: ఫుట్‌బాల్ రిఫరీలుగా పలమనేరు యువకుల ఎంపిక

అనంతపురం జిల్లా ఆర్డీటీ స్పోర్ట్స్ విలేజ్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక “ఏపీ సూపర్ 2026” ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ మ్యాచ్ అఫీషియల్స్‌గా పలమనేరుకు చెందిన రాకేష్, ఎస్.కె. హుజీఫా ఎంపికయ్యారు.
​చిత్తూరు జిల్లా నుండి రాష్ట్ర స్థాయికి ఎంపికైన వీరిద్దరినీ పలమనేరు ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు సి.ఎస్. నవీన్ కుమార్, ఎస్ వి సి ఆర్ జీడీసీ పలమనేరు కోచ్, ఫిజికల్ డైరెక్టర్ జి.వి. విక్రమ్ రాజ్ ఘనంగా అభినందించారు.
​వీరితో పాటు అసోసియేషన్ సభ్యులు దిలీప్ కుమార్, యువరాజ్, మన్సూర్, అల్తాఫ్, మురళి, గోపాల్, సాగర్, కిరణ్ లు కూడా రాకేష్, హుజీఫాకు తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పలమనేరు ఫుట్‌బాల్ క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడం మన ప్రాంతానికి గర్వకారణమని వారు పేర్కొన్నారు.

Posted Under AP
YES9 TV