తిరుమల నెయ్యి కల్తీ వివాదం: హిందూ సమాజానికి జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలి – టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు డిమాండ్

హిందువులకు జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి…

టిటిడి చైర్మెన్ బి.ఆర్. నాయుడు..

 

వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తో పాటు వైసీపీ డెకాయిట్ గ్యాంగ్ మొత్తం హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని టిటిడి చైర్మెన్ బి.ఆర్. నాయుడు డిమాండ్ చేశారు.తిరుపతిలో శుక్రవారం టిటిడి చైర్మెన్ బి.ఆర్. నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమలలో నెయ్యి కల్తీ జరగలేదని చెప్పడానికి సిగ్గుండాలని తీవ్రంగా వ్యాఖ్యానించారు. సిట్ దర్యాప్తు అనంతరం దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌లోనే నెయ్యి కల్తీ అంశం స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నెయ్యి టెండర్ ప్రక్రియ మొదటి నుంచీ చివరి వరకు నిబంధనల ఉల్లంఘనలే జరిగాయని, సామర్థ్యం లేని సంస్థలకు నెయ్యి టెండర్ అప్పగించి, దాదాపు రూ.250 కోట్ల విలువైన కల్తీ నెయ్యిని కొనుగోలు చేశారని విమర్శించారు.ఒక్క ఆవు కూడా లేకుండా, చుక్క నెయ్యి లేకుండా నెయ్యి తయారు చేసినట్లు చెప్పడం హాస్యాస్పదమని, నెయ్యి తయారీలో ఉపయోగించిన కెమికల్స్ అత్యంత ప్రమాదకరమైనవని తెలిపారు. దాదాపు 20 కోట్ల లడ్డూలు తయారు చేసి తిరుమల పవిత్రతకు తీవ్ర అపచారం చేశారని అన్నారు.
కమీషన్ల కోసమే కక్కుర్తి పడి భోలే బాబా డైరీని ఎంచుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని తెరవెనుక నుంచి నడిపింది చిన్న అప్పన్న అని, ఆయన వైవీ సుబ్బారెడ్డి పీఏ కాదా? అని ప్రశ్నించారు. దొంగల ముఠా నాయకుడు జగన్ కు తెలియకుండా ఇవన్నీ జరిగాయా? అని నిలదీశారు.
తిరుమల క్షేత్రం వైభవం వాటికన్ సిటీని దాటిపోయిందన్న అసూయతోనే క్రైస్తవ ముఠా కుట్రపూరితంగా ఈ వ్యవహారం నడిపిందని, టిటిడిని పూర్తిగా భ్రష్టుపట్టించారని ఆరోపించారు.భూమన కరుణాకర్ రెడ్డి భయంతోనే మృత్యుంజయ యాగం చేయించుకుంటున్నారని, చేసిన తప్పులకు తల వెయ్యి ముక్కలు అవుతాయన్న భయంతో ఇప్పుడు యాగాలు చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Posted Under AP
YES9 TV