Latest Posts

చిలకల గడ్డపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం… 12 మందికి తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి విషమం

ముదిగుబ్బ జనవరి 2: (YES 9 TV): మండల కేంద్రం ముదిగుబ్బకు ఏడు కిలోమీటర్ల సమీపంలో బుక్కపట్నం మండల పరిధిలోని చిలకలగడ్డ పల్లి గ్రామం వద్ద ఈరోజు ఉదయం 6:30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది గాయపడినట్లు తెలిసింది, నల్లమాడ మండల పరిధిలోని బసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 14 మంది కూలీలు
పొడ రాళ్లపల్లి గ్రామ సమీపంలో ఉన్న ఒక వ్యవసాయ తోటలో పనిచేయడానికి తమ గ్రామం నుంచి బొలెరో వాహనంలో కొండాపురం రోడ్డు మీదుగా వెళ్తుండగా చిలకడపల్లి గ్రామ సమీపంలో వారు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడినట్లు సమాచారం, ఈ ప్రమాదంలో 12 మందికి గాయాలు కాగా ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది, ఈ విషయం తెలిసిన వెంటనే ముదిగుబ్బ నుంచి 108 అంబులెన్స్ వాహనం సంఘటన స్థానానికి వెళ్లి గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది,

Posted Under AP
Editor