Latest Posts

ధర్మవరంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ పర్యటన: అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు

ముదిగుబ్బ డిసెంబర్ 30:(YES 9 TV) ధర్మవరం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు నమస్కారం 🙏🏻

రాష్ట్ర ఆరోగ్యశాఖ గౌరవ మంత్రివర్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ గారి ధర్మవరం నియోజకవర్గ పర్యటన వివరాలు:–

డిసెంబర్ 31 (బుధవారం):–

ఉదయం 10:30 నిమిషాలకు – ముదిగుబ్బ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నూతనంగా నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ భవనం భవనాన్ని ప్రారంభిస్తారు.

ఉదయం 11:10 నిమిషాలకు ముదిగుబ్బ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమీక్షా సమావేశంలో పాల్గొంటారు.

మధ్యాహ్నం 12:00 గంటలకు రామస్వామి తండాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.

మధ్యాహ్నం 12:45 నిమిషాలకు రామస్వామి తండాలో నూతనంగా నిర్మించిన సచివాలయాలు, రైతు సేవా కేంద్రాలు, హెల్త్ & వెల్నెస్ సెంటర్లని ప్రారంభిస్తారు.

మధ్యాహ్నం 03:30 నిమిషాలకు రాళ్లనంతపురం – కోడవండ్లపల్లి రహదారిపై KM 8/2-8 వద్ద పునర్నిర్మించిన ఎత్తైన కాజ్‌వే వంతెనను ప్రారంభిస్తారు.

జనవరి 01 (గురువారం):–

ఉదయం 09:00 గంటలకు ధర్మవరం శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయంలో వ్రత మండపం మరియు యాగశాలకు శంకుస్థాపన చేస్తారు.

ఉదయం 10:30 నిమిషాలకు ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో అందరికీ అందుబాటులో ఉంటారు.

ఇట్లు…
ఎన్డీఏ కార్యాలయం
ధర్మవరం….

Posted Under AP
Editor