ముదిగుబ్బ డిసెంబర్ 26:(YES 9 TV):
- కూటమి నాయకుల ఆధిపత్య పోరు, అధికారుల నిర్లక్ష్యం తో ముందుకు సాగని ఉపాధి హామీ పథకం పనులు
- నిరాశ చెందుతున్న పండ్ల తోటల సాగు రైతన్నలు
- విలేకరుల సమావేశంలో ఆరోపించిన సిపిఐ నాయకులు చల్లా శ్రీనివాసులు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుమారు 17 నెలలుగా మండలంలో ఉపాధి హామీ పథకం ద్వారా పండ్లతోటలు సాగు చేయాలనికున్న రైతన్నలు కూటమి నాయకుల ఆధిపత్య పోరుతో నేటికీ పండ్ల తోటలు సాగు చేసుకోవడానికి అవకాశం లేకుండా పోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు శుక్రవారం ముదిగుబ్బలో జరిగిన విలేకరుల సమావేశంలో తీవ్రస్థాయిలో ఆరోపించారు, ఈ మేరకు శ్రీనివాసులు మాట్లాడుతూ గత ఏడాది జూన్ నెల నుంచి నేటి వరకు మండల వ్యాప్తంగా సుమారు 700 మంది రైతులు ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటల పెంచుకోవడానికి దరఖాస్తు చేయడం జరిగిందన్నారు, ఈ నేపథ్యంలో గత ఏడాది కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి నాయకుల వర్గ పోరుతో నేటికీ చాల పంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం జరకపోవడంతో ఉపాధి హామీ పథకం పనులకు గ్రహణం పట్టిందన్నారు, ముఖ్యంగా రైతులు పండ్లతోటలు సాగు చేసుకోవడానికి దరఖాస్తులు సమర్పించి సుమారు 17 నెలలు అవుతున్న అధికారుల అలసత్వం, నాయకుల నిర్లక్ష్యంతో మండల వ్యాప్తంగా చాలా గ్రామాల్లో ఒక్క మొక్కను కూడా రైతన్నలు నాటుకోలేని దుర్భర పరిస్థితి నెలకొందని శ్రీనివాస్లు ఆరోపించారు, ఇప్పటికే గత 17 నెలలుగా రెండుసార్లు వర్షాకాల సీజన్ పూర్తయినా పండ్ల తోటలు పెంచుకోవడానికి ఏమాత్రం అవకాశం లేకుండా పోవడంతో రైతన్న ఆవేదనకు అంతులేకుండా పోతుందని తెలిపారు, అతివృష్టి అనావృష్టి వలన జీవనాధారమైన వేరుశనగ తదితర పంటలు గిట్టుబాటు కాకపోవడంతో పండ్లతోటల ద్వారా నైనా లబ్ధి పొందుదామని ఆశాభావంతో ఉన్న రైతన్నలకు కూటమి నాయకుల ఆధిపత్య పోరు శాపంగా మారిందన్నారు, నూతన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మండలంలో సకాలంలో ఉపాధి హామీ పథకం పనులు జరగకపోవడంతో ఉపాధి కూలీలు, రైతన్నలు తీవ్ర ఆవేదన గురవుతున్నారని శ్రీనివాసులు తెలిపారు, కనుక ఇప్పటికే వర్షాకాలం సీజన్ దాటిపోయిన దృష్ట్యా 2026వ సంవత్సరంలోనైనా సకాలంలో ఈ ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటలు పెంచుకోవడానికి అవకాశం కల్పించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు, లేని పక్షంలో త్వరలోనే రైతన్నలతో కలిసి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా చల్లా శ్రీనివాసులు ప్రభుత్వానికి తెలియజేశారు, ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల సహాయ కార్యదర్శి తిప్పయ్య తో పాటు స్థానిక నాయకులు కుర్ర నాయుడు, లింగుట్ల వెంకట రాముడు, వై రమేష్ నాయుడు, సోంపల్లి భాస్కర తోపాటు పలువురు రైతులు పాల్గొన్నారు
