Latest Posts

క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే గురజాల..

క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే గురజాల

చిత్తూరు నగరంలోని 12వ వార్డు నరిగపల్లిలో గురువారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక చర్చిలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ క్యాండిల్ వెలిగించి క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేశారు. స్థానిక మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రేమ, శాంతి, సోదర భావాలతో కూడిన క్రిస్మస్ పండుగను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రవి, గోపి, స్థానిక పార్టీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor