- ఆంగ్ల భాష పై పట్టు సాధించాలి
- విద్యార్థులు నైపుణ్యాలపై అవగాహన కలిగి ఉండాలి
- చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి
- కలెక్టరు సుమిత్ కుమార్
ప్రతి విద్యార్థి నైపుణ్యాలపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టరు సుమిత్ కుమార్ సూచించారు. నగరంలోని మహాత్మ జ్యోతిరావు పూలే భవనంలో శనివారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కెరీర్ ఎక్స్పో జ్యోతి ప్రజ్వలన చేసి ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఈవో రాజేంద్ర ప్రసాద్, సర్వ శిక్ష అభియాన్ పీడీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. సుమారు 20 స్టాల్స్, క్యారియర్ మోడల్ కాంపిటీషన్ 107 టీములు, ఒకేషనల్ టీంలు 88, డ్రాయింగ్ పోటీలలో 96 టీములు పాల్గొన్నారు, ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ… విద్యార్థి దశ నుంచి ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి కృషి చేయాలన్నారు. గణితం లేదా ఇంగ్లీష్ వంటి వంటి సబ్జెక్టులపై మంచి పట్టు సాధించాలన్నారు. ఈ ఎగ్జిబిషన్లో హైస్కూల్ విద్యార్థులు ప్రతి సబ్జెక్టు పైన అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆసక్తి కలిగిన రంగంలో విద్యార్థులను తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. ఆంగ్ల దినపత్రికపై ప్రతిరోజు 20 నిమిషాలు చదవాలని తెలిపారు, యూట్యూబ్లో, విజ్ఞానానికి సంబంధించిన ఎన్నో విషయాలు ఉన్నాయని… వాటి తెలుసుకోవాలని అభివృద్ధి చెందాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అనేక పథకాలు ప్రవేశ పెట్ఠిందన్నారు. జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలో, యూనివర్సిటీలలో పలు కోర్సులు ప్రవేశపెట్టి విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. 21వ శతాబ్దంలో విద్యార్థులు పోటీపడే విధంగా ఉండాలని… నెట్వర్క్ నైపుణ్యాలను అభ్యసించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
