వెంకటేశ్-త్రివిక్రమ్ కాంబోలో ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’ ఫస్ట్ లుక్ విడుదల

విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న కొత్త చిత్రానికి సంబంధించిన టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ అనౌన్స్‌మెంట్ చేశారు. ఈ సినిమాకు ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’ అనే క్లాస్ టైటిల్‌ను నిర్ణయించారు. విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో వెంకటేశ్ ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపిస్తున్నారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి చిత్రాలు ఫ్యామిలీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఇన్నేళ్ల తర్వాత వీరి కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు (డిసెంబర్ 10) నుంచే ప్రారంభం కాబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో వెంకటేశ్‌కు జోడీగా శ్రీనిధి శెట్టిని తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసి, వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకులకు ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబోకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Editor