తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ప్రధాన నిందితులలో ఒకరైన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) అధికారులు ప్రభాకర్ రావును పలుమార్లు విచారించి, కీలక ఆధారాలను సేకరించారు.

బెయిల్ రద్దు చేయాలంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో నేడు దీనిపై విచారణ జరగనుంది. బెయిల్‌పై బయట ఉంటే ప్రభాకర్ రావు సాక్షులను ప్రభావితం చేయగలరని ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టులో వాదించనున్నారు. ఈ కేసు తీవ్రత, సేకరించిన ఆధారాలు, నిందితుడి పాత్ర దృష్ట్యా బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం వాదించే అవకాశం ఉంది.

ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ రద్దుపై నేడు కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఈ కేసు విచారణలో మరియు తెలంగాణ రాజకీయాలలో ప్రభావం చూపనుంది.

Editor