Latest Posts

అల్లు అర్హ అరుదైన ఘనత: ‘యంగెస్ట్ చెస్ ట్రైనర్‌’గా నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ చిన్న వయసులోనే అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అత్యంత పిన్న వయస్కురాలైన చెస్ ట్రైనర్‌గా (Youngest Chess Trainer) అసాధారణ ప్రతిభ కనబరిచి నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ, అర్హకు ప్రశంసలు దక్కేలా చేస్తోంది.

అల్లు అర్హ తన అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ, 30 చెస్ పజిల్స్‌ను పరిష్కరించడంలో ఏకంగా 50 మంది విద్యార్థులకు విజయవంతంగా శిక్షణ ఇచ్చింది. ఇంత చిన్న వయసులో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, చదరంగంలో ఈ స్థాయి నైపుణ్యం చూపడం ఆమెకు ఈ అరుదైన రికార్డు దక్కడానికి కారణంగా నిలిచింది.

గతంలో గుణశేఖర్ దర్శకత్వం వహించిన ‘శాకుంతలం’ సినిమాలో బాలనటిగా అరంగేట్రం చేసిన అర్హ, తన నటనతో, స్పష్టమైన తెలుగు ఉచ్ఛారణతో విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇప్పుడు చదువుతో పాటు చదరంగంలోనూ అద్భుత ప్రతిభ కనబరుస్తుండటంతో, ఆమె తండ్రికి తగ్గ కూతురని, అల్లు అర్జున్ స్ఫూర్తిని కొనసాగిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Editor