నేడు ‘కుంభ’గా పృథ్వీరాజ్ లుక్ విడుదల: SSMB29 నుంచి సంచలన అప్‌డేట్!

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం SSMB29. సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా, దర్శకధీరుడు ఎస్.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా డైరెక్టర్ రాజమౌళి స్వయంగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్‌డేట్‌ను వెల్లడించారు. ఈనెల 15న జరగనున్న ‘GlobeTrotter’ ఈవెంట్ వరకు వేచి ఉండలేమని చెబుతూ, “అందులో భాగంగానే ఇవాళ పృథ్వీరాజ్ లుక్ రిలీజ్ చేస్తాం” అని ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుగుతున్నట్లు రాజమౌళి వెల్లడించారు. ఈ నెల 15న జరగనున్న ‘GlobeTrotter’ ఈవెంట్ కోసమూ భారీగా సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈవెంట్ వరకు అభిమానుల ఆసక్తిని కొనసాగించేందుకు ఈ వారాన్ని ఆసక్తికర విషయాలతో నింపుతామని రాజమౌళి హామీ ఇచ్చారు. ఈ ప్రకటనతో SSMB29 అప్‌డేట్‌ల కోసం ఎదురుచూస్తున్న అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో ‘కుంభ’ అనే కీలక విలన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అతని లుక్‌పై, ముఖ్యంగా మహేశ్ బాబుతో అతని స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుందనే విషయంపై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. రాజమౌళి ఈరోజు లుక్‌ను విడుదల చేయడంతో సినిమాపై అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి.

 

Editor