పాకిస్థాన్‌కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ ఆసిఫ్ అఫ్రిదీ 38 ఏళ్ల వయసులో టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసి ఓ అరుదైన రికార్డు సాధించాడు. సాధారణంగా క్రికెటర్లు 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయసులో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతారు. కానీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం ఆసిఫ్‌ను లేటు వయసులో జట్టులోకి ఎంపిక చేయడమే కాకుండా, ఇప్పుడు ఏకంగా తుది జట్టులో చోటు కల్పించడం సంచలనంగా మారింది.
ఆసిఫ్ అఫ్రిదీ గతంలో దేశవాళీ క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ ఆరోపణల కారణంగా అతడు రెండేళ్లపాటు నిషేధం కూడా ఎదుర్కొన్నాడు. క్రీడా జీవితంలో అలాంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్న తర్వాత, మళ్లీ జాతీయ జట్టులోకి రావడం విశేషం. అతడు సుదీర్ఘ విరామం తర్వాత 38 ఏళ్ల వయసులో జాతీయ జట్టు తరఫున టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేయడం చర్చనీయాంశంగా మారింది.
తాజాగా ఆసిఫ్‌కు తన కంటే 13 ఏళ్ల చిన్నవాడైన యువ పేసర్ షహీన్ అఫ్రిదీ టెస్ట్ క్యాప్ అందించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లేటు వయసులో, గతంలో ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో నిషేధం ఎదుర్కొన్న తర్వాత కూడా మళ్లీ జట్టులోకి రావడం క్రీడాభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.
