కడప జిల్లా:
బ్రహ్మంగారి మఠం మండలం రేకులకుంట గ్రామం లో ఎస్సీ కాలనీ దక్షిణాన 18వ శతాబ్దం నాటి విగ్రహం బయలు పడిందని రచయిత, చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ శుక్రవారం మీడియాకు తెలిపారు.
ఈ సందర్భంగా బొమ్మిశెట్టి మాట్లాడుతూ
వైస్ ఎంపీపీ కూనపులి రాజశేఖర్ నాయుడు ఉదయం తన పొలాన్ని దృక్కి దున్నుచుండగా ఈ విగ్రహం బయల్పడిందన్నారు.
అరుదైన ఈ విగ్రహం
ఈ ప్రాంత అలనాటి చరిత్రను తెలియజేసేందుకు సాక్షాధారమని ఆయన చెప్పారు.
ఇది ఒక మహిళా విగ్రహమని చెప్పారు.ఎడమవైపు కొప్పు ధరించి ఉందని తెలిపారు.
మెడలో పెండెంట్ (పతకo) ధరించి ఉందని చెప్పారు. ఎడమవైపు చేతిలో ఒక చంటి పిల్లోడిని నడుముకు పట్టుకొని ఉందని రచయిత వివరించారు.

కుడి వైపు చేతిలో ఒక పుష్పాన్ని చేపట్టినట్లు ఆనాటి శిల్ప కారులు అద్భుతంగా చెక్కారని ఆయన వెల్లడించారు.
నడుము నుంచి వస్త్రాదరణ చేసినట్టు కానవ వస్తోందని చెప్పారు. కాళ్లకు, చేతులకు కడియాలు ధరించిన్నట్లు చిత్రీకరించారన్నారు. చెవులు చాలా పెద్దవిగా చెక్కారని చెప్పారు.
ఈ విగ్రహo గురించిన సమాచారాన్ని కడప యోగివేమన విశ్వవిద్యాలయ లలిత కళల విభాగపు సహాయ ఆచార్యులు కోట మృత్యుంజయ్ రావుకి తెలుపగా ఆయన ఇది 18వ శతాబ్దం నాటి విగ్రహమని స్పష్టం చేశారని రమేష్ వివరించారు.
