మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్‌కు భుజానికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయినట్లు సమాచారం. కిమ్స్ ఆసుపత్రిలో స్పెషలిస్ట్ వైద్యుల బృందం ఈ సర్జరీని నిర్వహించింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో తారక్ విశ్రాంతి తీసుకుంటున్నారని, త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని వైద్య వర్గాలు తెలిపాయి. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
గత నెల 27న జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైనట్లు ఆయన కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. గాయం కారణంగా కొంతకాలం షూటింగ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. తాజాగా శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడంతో అభిమానుల్లో ఆందోళన తగ్గింది.
రికవరీ పీరియడ్ పూర్తైన అనంతరం సెప్టెంబర్ నుంచి తారక్ తన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘డ్రాగన్’ షూటింగ్‌లో తిరిగి పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం చిత్ర బృందం ఇప్పటికే తదుపరి షెడ్యూల్‌కు సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది.
