అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో పట్టు కేశవ్ పిలై ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు పేద విద్యార్థుల సాంకేతిక విద్య కోసం గుంతకల్ రైల్వే డివిజనల్ మేనేజర్ చంద్రశేఖర్ 30 కంప్యూటర్ల ను వితరణ చేసి పాఠశాలలో ఘనంగా కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గుంతకల్ రైల్వే డివిజనల్ మేనేజర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ పేద విద్యార్థుల సాంకేతిక విద్యాభివృద్ధి అభ్యున్నతకై వితరణ చేస్తున్నానని విద్యార్థినీ విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు తమ జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని చదువులో రాణించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుభాన్ భాష మాట్లాడుతూ రైల్వే డివిజనల్ మేనేజర్ చంద్రశేఖర్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రైల్వే డివిజనల్ మేనేజర్ చంద్రశేఖర్ ను గుత్తి కోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయ భాస్కర్ గైడ్ రమేశ్ డి ఆర్ ఎం కు పుష్పగుచ్చం శాలువా,జ్ఞాపికతో స్వాగతం పలికారు. అనంతరం ప్రాచీన గుత్తి కోట వెలుపల ఉన్న యూరోపియన్ సమాధులను సందర్శించి దత్త మండలాల మొట్టమొదటి దత్త మండలాల కలెక్టర్ సర్ థామస్ మన్రో, మైసూర్ గోల్డ్ మైన్స్ డైరెక్టర్ డైమండ్ సమాధిని ప్రాచీన గుత్తి కోట చరిత్రను గైడ్ రమేశ్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డిఎన్ఎ ప్రమోద్ కుమార్, గుంతకల్ రైల్వే డివిజనల్ రైల్వే అభివృద్ధి కమిటీ సభ్యులు విజయభాస్కర్ చౌదరి రైల్వే ఉద్యోగ సంఘాల నేతలు, రైల్వే సిబ్బంది గుత్తి కోట సంరక్షణ సమితి సభ్యులు తదితరులు
గుంతకల్ రైల్వే డిఆర్ఎం పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ హైస్కూల్ కు 30 కంప్యూటర్లు వితరణ..!
