Latest Posts

లేపాక్షి కళా శిల్పాలు ఎంతో అద్భుతం… అపురూపం..? లేపాక్షి లో వీరభద్ర స్వామి దేవాలయాన్ని సందర్శించిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి..

(లేపాక్షి )సత్యసాయి జిల్లా )

పుట్టపర్తి :21

 

ఎంతో ప్రసిద్ధిగాంచిన లేపాక్షి ఆలయ కళా శిల్పాలు చాల అద్భుతంగా ఉన్నాయని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. హిందూపురంలోని ఏం జీ ఏం మైదానంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ 11వ యోగ దినోత్సవ కార్యక్రమాన్ని హాజరై వాటిని ముగించుకొన్న తర్వాత మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి తో కలసి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి నేరుగా లేపాక్షి కి వీరభద్ర స్వామి దేవాలయానికి విచ్చేశారు. అక్కడికి విచ్చేసిన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డితోపాటు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డికి ఆలయ పూజారులు పూర్ణకుంభాలతో స్వాగతం పలికారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే మాజీ మంత్రికి వేడ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ దేవాలయంలో నిర్మించిన లేపాక్షి వీరభద్ర ఆలయ అద్భుత కట్టడాలు శిల్పాలు వాటి యొక్క వివరాలు అరియు మరియు ఆలయ ప్రతిష్ట విశేషాలను చరిత్రకారుడు రఘురామ ద్వారా ఎమ్మెల్యే ,మాజీ మంత్రి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ ,మన రాష్ట్రంలో లేపాక్షి కి ఎంతో ప్రసిద్ధి ఉందనీ భవిష్యత్తులో మంచి పర్యాటక రంగంగా ఈ ప్రాంతం నిలిచిపోతుందనిa అన్నారు. దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఈ లేపాక్షి ఆలయానికి విచ్చేస్తుంటారని ప్రధానంగా పర్యాటకులకు ఎంతో చూడదగ్గ ప్రాంతమన్నారు. .ముఖ్యంగా ఈ ఆలయంలో ప్రత్యేకంగా ఏడు పడగల నాగుపాము, సీతాదేవి అడుగు ,రావణాసురుడు, ఆంజనేయులు, ఈశ్వరుడు పార్వతి దేవి, శ్రీకాళహస్తి చరిత్ర, విరూపాన్న, దుర్గాదేవి , రఘురామ స్వామి ,ఏనుగు , అర్ధాంతరంగా నిలిచి పోయిన మండపం , జటాయువు ,అతి పెద్ద నంది విగ్రహాలు పర్యాటకులకు ఇవి ప్రత్యేక ⁸ఆకర్షణగా నిలుస్తాయన్నారు. ఈ దేవాలయంలో భూమిని తాకకుండా ఏర్పడిన స్థంభం ప్రతి ఒక్కరిని అబ్బురుపరిచేలా ఆనాటి నిర్మాణ కారులు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇంకా ఎన్నో అద్భుతమైన శిల్పాలు ఎంతో అందంగా ఆనాటి చిత్రకారులు ప్రజలకు కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించారని కొనియాడారు. దేశంలోని లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయానికి ఒక ప్రత్యేక స్థానం ఉందని అందుకే ఇక్కడికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు తో పాటు దేశ విదేశాల నుంచి ఎంతోమంది గొప్ప ప్రముఖ వ్యక్తులు ఇక్కడికి విచ్చేసి ఆలయ ప్రతిష్టను వాటి విశేషాలను క్షుణ్ణంగా తెలుసుకొని ఆచరిస్తుంటారని పేర్కొన్నారు. అనంతరం అతి పెద్ద నంది విగ్రహాన్ని సందర్శించారు. దేవాలయం వద్ద వీరభద్ర స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయ నిర్వహకులు రాంప్రసాద్ ట్రస్ట్ సభ్యులు ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సందర్శించి అక్కడే అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి పార్టీల నాయకులు ,ఆలయ ట్రస్టు సభ్యులు రాంప్రసాద్ ఆనంద్, సప్తగిరి కళాశాల ప్రిన్సిపల్ నారాయణరెడ్డి, గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor