తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, డెయిరీ విభాగంలో పనిచేస్తున్న SC సామాజిక వర్గానికి చెందిన అధ్యాపకులు అసిస్టెంట్ ప్రొఫెసర్ V. రవివర్మ గారి పట్ల.. అదే విభాగంలో పనిచేస్తున్న ఆధిపత్య ఉన్నత కులానికి, వర్గానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ రవీంద్రారెడ్డి చూపిస్తున్న కులవివక్ష కారణంగా.. ఇదో ఇలా కింద నేలపై కూర్చొని విధులు నిర్వహిస్తున్న దారుణ, దుర్మార్గ మరియు అన్యాయ పరిస్థితి.
రాజ్యాంగం అమలులోకివచ్చి సుమారు 77 సంవత్సరాలు అవుతున్నా.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ – 14, 15, 17 ప్రకారం ఎన్ని చట్టాలు, నిబంధనలు మరియు మార్గదర్శకాలు ఉన్నా.. ఇంకా అస్పృశ్యత, అంటరానితనం, అణిచివేత, దోపిడి, దండన, చిన్నచూపు మరియు వివక్షత రూపుమాపడంలో.. “ప్రభుత్వం – పౌరసమాజం” అందరూ విఫలం అవుతూనే ఉన్నారు. ఇందుకు అందరం సిగ్గుతో తలదించుకోవాలి. ఇదేనా తోటి మనిషికి, ఉద్యోగికి మనమిచ్చే గుర్తింపు, గౌరవం, విలువ, ప్రాధాన్యత మరియు ప్రాముఖ్యత? ఎటుపోతున్నాం, ఏంచేయాలనుకుంటున్నాం?. ఈ అనైతిక అనాగరిక మరియు అప్రజాస్వామిక అమానుష ఘటనను తాము తీవ్రంగా నిరసిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం మరియు కండిస్తున్నాం. మానవీయకోణంలో, మానవతావిలువలు ఉన్న అందరూ ముక్తకంఠంతో ఖండించాలని మనవిచేస్తూ.. బాధితుడిపట్ల.. చట్టవ్యతిరేక చర్యకు పాల్పడిన నిందితుడు, బాధ్యుడిపై వెంటనే SC, ST కేసు సహా వర్తించే సెక్షన్లన్నీ నమోదుచేసి, చట్టపరమైన చర్యలు చేపట్టాలని.. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా గట్టిచర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను మరియు పౌర సమాజాన్ని కోరుతున్నాం.
నూతన ప్రజాస్వామిక విప్లవ జైభీములు మరియు బుద్ధవంధనాలతో….
(సంగటి మనోహర్ మహాజన్)
వ్యవస్థాపక జాతీయ కన్వీనర్,
రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి/Constitutional Rights Protection Committee (CRPC);
వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు,
మహాజన రాజ్యం పార్టీ/Mahajana Rajyam Party (MRP);
కడప, ఆంధ్రప్రదేశ్, ఇండియా
