వల్లభనేని వంశీపై నమోదైన కేసు గురించి సంచలన విషయం వెల్లడించబోతున్నట్లు వైసీపీ ట్వీట్ చేసింది. ఇవాళ రాత్రి 7 గంటలకు గన్నవరం కేసుకు సంబంధించిన నిజాన్ని బయటపెట్టబోతున్నాం. అతిపెద్ద రహస్యం బయటపడనుంది అని ట్వీట్ లో వైసీపీ రాసుకొచ్చింది. కాగా, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు ఫిర్యాదురారైన సత్వవర్ధన్ ను బెదిరించారని ఆరోపిస్తూ పోలీసులు వంశీని జైలుకు పంపిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ జైలులో ఆయనతో ములాఖత్ అయ్యారు.
రాత్రి 7 గంటలకు సంచలన నిజం బయటకు.. వైసీపీ ట్వీట్ వైరల్..!
