ఎస్ 9}యాడికి
యాడికి మండలంలో ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా వర్షం కురవడం,దిగుబడులు ఆశాజనకంగా లేని కారణంగా రాష్ట్ర ప్రభుత్వం యాడికి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించారు.కరువు మండలంగా ప్రకటించినందున వర్షాభావ పరిస్థితుల వల్ల దెబ్బతిన్న వర్షాధార పంటలను గుర్తించి, రైతుల వివరాలను వారి పంటల మరియు ఆధార్ బ్యాంక్ అకౌంట్ వివరాలను నమోదు చేసుకొని అన్ని రైతు సేవ కేంద్రాల్లో సామాజిక తనిఖీ కొరకు ఉంచడం జరిగింది.రైతులు తమ వివరాలను తమ రైతు సేవ కేంద్రంలో చూసుకొనగలరు.తుది నివేదికను 28.వ తేదీ న మంజూరు నిమిత్తం ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది అని మండల వ్యవసాయ అధికారి తెలిపారు.
