ఖబర్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా..

INC:- నవంబర్ 4 సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు యండి హమీద్ గారి అద్వార్యంలొ పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా హమీద్ గారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ కి చెందిన కొంతమంది నాయకులు రైస్ మిల్లర్ల తో కుమ్మక్కై ఆరుగాలం కష్టపడి పండించిన రైతులను అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేసే విధంగా బిఆర్ యాస్ పార్టీ వారు ద్వంద వైఖరి అవలంబిస్తున్న తీరు పై హమీద్ గారు మండిపడ్డారు,

గత ప్రభుత్వ పాలనలో రైస్ మిల్లర్ల బకాయిలు రాబట్టుక పోగా మిల్లర్లకు బిఆర్ఎస్ పాలకులు రైతుల కష్టాన్ని దోచుకునే విధంగా గత ప్రభుత్వ ఏలుబడి చేసిన దుర్మార్గపు పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడి కాంగ్రెస్ ప్రజా పాలనకు నాంది పలికారు అని అన్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు రైతుల కళ్ళల్లో ఆనందం చూడడం కోసం రైతును రారాజుగా చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని అన్నారు, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు,

రైతులు ఎక్కడ ఇబ్బందులు పడకూడదని ముందుగానే వడ్ల కొలుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని సగర్వంగా తెలియజేశారు, మరియు కొనుగోలు కేంద్రాలలో రైతులకు అన్ని వసతులను సమకూర్చడం జరిగినది, కానీ కొంతమంది బి.ఆర్.ఎస్ పార్టీ కి చెందిన వారు తొత్తులుగా మారి రైతులను తప్పుదోవ పట్టిస్తూ కాంగ్రెస్ పైన బురదజల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూందని ఉన్నారు, ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గం బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేటి రామారావు గారు రైస్ మిల్లర్లకు మాయ మాటలు చెప్పుతున్నారు గత ప్రభుత్వ రైతులను దోచుకునే విధానమే ఉండాలని తూకంలో గాని ధాన్యంలో గాని వసతులపట్ల గాని మరియు ఇతరాత్ర లలో రైతులను మోసాలు చేసే విధానాన్ని మిల్లర్లకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారు, అని హమీద్ గారు అన్నారు, ఇలాంటి మోసపూరిత ఆలోచన విధానం లో కరీంనగర్ ప్రాథమిక వ్యవసాయ అధ్యక్షులు కొండూరి రవీందర్ రావు గారి పాత్ర కూడా ఉందని హమీద్ మండిపడ్డారు, బి ఆర్ ఎస్ నాయకులు ఇలాంటి చౌక వారు విధానం మార్చుకోవాలని లేదంటే రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారంటూ ధ్వజమెత్తారు, రైతుల పట్ల బీఆర్ఎస్ పార్టీ కి చిత్తశుద్ధి ఉంటే రైతులను ఆదుకునే విధంగా ఉండాలని ,వారి జీవితాలతో ఆడుకోవడం మానుకోవాలని ఇ సందర్భంగా హితువు పలికారు, ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కొమిరి శెట్టి తిరుపతి ప్రధాన కార్యదర్శి మూల రామచంద్రారెడ్డి పట్టన అధ్యక్షులు పాపగారి రాజు గౌడ్ మండల బీసీ సెల్ అధ్యక్షులు రాజు గౌడ్ , వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ జి.రాజనర్సు కే లింగం ఏ ప్రభాకర్ జి గంగరాజు గౌడ యండి అజాం, బి సత్తయ్య బి విఠల్ కే బాల్ రెడ్డి మరియు పాక్స్ డైరెక్టర్ అంజిరెడ్డి, పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ (గౌరీ) శంకర్ వివిధ గ్రామాల శాఖ అధ్యక్షులు నర్సయ్య మహేందర్ రామచంద్రం లక్ష్మణ్ భూమరాజం వినోద్ రవి,యండి నుస్రతుల్లా

ఆర్ గోపాల్, టి రవి, జి రాజులు, జి కుమార్, బి రాజు గౌడ్ ,అక్కపెల్లి బాలయ్య, తాజోద్దీన్ యాదుల్లా దెశెట్టి శేఖర్ నాంపల్లి లచ్చయ్య,

Editor