లింగన్న పెట వాగు పై తాత్కాలిక మట్టి రోడ్డు పై పునః ప్రయాణ సౌకర్యం…

INC:- ఆగష్టు 5 శనివారం రోజున గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యండి హమీద్ గారి అద్వార్యంలొ ఈరోజు సిద్దిపేట టు కామారెడ్డి వెళ్లే ప్రధాన రహదారి మధ్యలో లింగన్న పెట వాగు పై తాత్కాలిక మట్టి రోడ్డు వేయడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ నాయకులు కొబ్బరికాయలు కొట్టి ఆర్టీసీ బస్సును పునః ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా హమీద్ గారు మాట్లాడుతూ నాడు కాంగ్రెస్ పార్టీ కి చెందిన గౌరవనీయులు మంత్రివర్యులు స్థానికులు శ్రీ పాటి రాజం గారు గతంలో నాణ్యతతో కూడిన పరికరాలను ఉపయోగించి బ్రిడ్జిని నిర్మించారు,

గత బీఆర్ఎస్ పాలకులు కేటీ రామారావు గారు హై లెవెల్ బ్రిడ్జి నిర్మిస్తామని మాయ మాటలు చెప్పి ఉన్న బ్రిడ్జిని కూల్చివేయడం జరిగిందని, అన్నారు, టిఆర్ఎస్ పాలకుల నిర్లక్ష్యం వలన ప్రయాణికులు అనేక ఇబ్బందులు బడ్డారు, తాత్కాలిక మట్టి రోడ్డు వేసిన సందర్భంలో అధిక వర్ష పాతంతొ వాగు ఉదృతంగా ప్రవహించి మట్టి రోడ్డు పూర్తిగా కొట్టుక పోవడంతో, ప్రయాణికులకు వాహనదారులకు అత్యవసర సేవలకు ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి కావడం జరిగింది, ఇట్టి విషయాన్ని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంన్చార్జి కేకే మహేందర్ రెడ్డి గారి ద్రుష్టి కి తీసుకపోవడం జరిగింది వెంటనే మహేందర్ గారు జిల్లా కలెక్టర్ గారి సహకారంతో లింగన్నపేట వాగుపై తాత్కాలిక మట్టి రోడ్డు వేసి ఈరోజు ఆర్టీసీ బస్సులను ప్రారంభించామని సంతోషాన్ని వ్యక్తపరిచారు ఈ సందర్భంగా ఇరు గ్రామాల ప్రజలు కాంగ్రెస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేశారు,

అంతేకాకుండా అతి త్వరలో నాణ్యతతో కూడిన పరికరాలను ఉపయోగించి హై లెవెల్ బ్రిడ్జిని కాంగ్రెస్ పార్టీ పెద్దలు చొరవ తీసుకొని ప్రయాణికులకు రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చేసే బాధ్యత గౌరవనీయులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, ఆది శ్రీనివాస్ గారు, కేకే మహేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారి సహకారంతో హై లెవెల్ బ్రిడ్జిని అతి త్వరలో పూర్తి చేస్తారని హమీద్ గారు భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా ప్రయాణికులు కాంగ్రెస్ పార్టీని అభినందించారు.

ఇట్టి కార్యక్రమంలో హమీద్ గారితో పాటు జిల్లా ఉపాధ్యక్షులు కొమరిశెట్టి తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి, మూల రామచంద్ర రెడ్డి, బీసీ సంక్షేమ ప్రతినిధి పర్శహాన్మండ్లు, మండల యూత్ అధ్యక్షులు గంగి స్వామి, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ పాతూరు అంజిరెడ్డి డైరెక్టర్లు భూక్య విటల్ ,కోట లింగం గెరుగంటి రాజనర్సు, యండి అజమ్ ,సింగిల్ విండో డైరెక్టర్ రాజ్వీర్, పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ (గౌరి) శంకర్, మండల బీసీ సెల్ అధ్యక్షులు గుర్రం రాజు గౌడ్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పంతం సురేష్ ,పార్టీ సీనియర్ నాయకులు జంగం రాజులు రాజబోయిన లచ్చయ్య పెద్దివేని మల్లయ్య ఎగదండి మహేష్ అజ్మీర్ భాస్కర్ తాజుద్దీన్ నాంపల్లి వెండ భాస్కర్ బాబు, మరియు పార్టీ శ్రేణులు కార్యకర్తలు వివిధ గ్రామాల పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.

Editor