జగన్ ను అరెస్టు చెయ్యండి, రంగంలోకి దిగిన జనసేన, ఏం జరిగిండంటే..?

తిరుమల శ్రీవారి లడ్డూల తయారీ కోసం గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె వాడారని వెలుగు చూడడం, పలు ఆరోపణలు రావడంతో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు మండిపడుతున్నారు. శ్రీవారి లడ్డూల తయారి కోసం కల్తీ నెయ్యి ఉపయోగించడానికి కారణం అయిన వారిపై చట్టపరంగా సమగ్ర విచారణ జరిపించి తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

 

కమిషన్ల కోసం కక్కుర్తిపడి శ్రీవారి మనోభావాలతో ఆడుకున్నారని, తిరుమల పవిత్రతను, శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసిన మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు చేసి వెంటనే ఆయన్ను అరెస్టు చేయాలని జనసేన నాయకుడు కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. తిరుమల ఆలయాన్ని, శ్రీవారి పోటును సంప్రోక్షణ చేయాలని జనసేన నాయకుడు కిరణ్ రాయల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మనవి చేశారు.

 

తిరుమల శ్రీవారి లడ్డూల తయారు చేయడానికి కల్తీ నెయ్యి కొనుగోలు చేసే విధంగా అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రయత్నించారని జనసేన నాయకుడు కిరణ్ రాయల్ ఆరోపించారు. కల్తీ నెయ్యి కొనుగోలు చేసే విధంగా టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డి టీటీడీలో చక్రం తిప్పారని జనసేన నాయకుడు కిరణ్ రాయల్ ఆరోపించారు. కల్తీ నెయ్యి కొనుగోళ్లలో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి ప్రమేయం ఉందని, ఆయనపైన విచారణ జరిపించాలని జనసేన నాయకుడు కిరణ్ రాయల్ చంద్రబాబు ప్రభుత్వానికి మనవి చేశారు.

 

తిరుపతిలో వేటు పడింది, వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగింది?

శ్రీవారి లడ్డులో ఉపయోగించిన కల్తీ నెయ్యిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని తిరుపతి ఎస్పీ కి శనివారం జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. తిరుమల పవిత్రతను దెబ్బ తీయడానికి ఐదు సంవత్సరాలలో పని చేసిన టీటీడీ చైర్మన్లు, అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై విచారణ జరిపించి చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవాలని తిరుపతి జనసేన నాయకులు డిమాండ్ చేశారు.

 

గత ఐదు సంవత్సరాల కాలం తిరుమలను కూడా స్వార్థ రాజకీయాలు కోసం ఉపయోగించుకున్న వైసీపీ నాయకులుపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, దేశ విదేశాల్లో ఉన్న కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలు కాపాడాలని తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జననసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు మనవి చేశారు.

Posted Under AP
Editor