జాయింట్ కలెక్టర్ గా శివ్ నారాయణ్ శర్మ బాధ్యతల స్వీకరణ..

అనంతపురం, ఆగస్టు 21 :

అనంతపురం జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ గా శివ్ నారాయణ్ శర్మ బాధ్యతలను స్వీకరించారు. ముందుగా బుధవారం నగరంలోని జాయింట్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయం చేరుకున్న నూతన జాయింట్ కలెక్టర్ కి ఇంచార్జి జాయింట్ కలెక్టర్ మరియు డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, సివిల్ సప్లై డిఎం రమేష్ రెడ్డి, కలెక్టరేట్ ఏఓ జి.మారుతి, తహసిల్దార్ హరిప్రసాద్, తదితరులు పుష్పగుచ్చాలు, పూల మొక్కలు అందించి ఘన స్వాగతం పలికారు.

 

జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ని కలిసిన నూతన జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ :

 

-అనంతరం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ గారిని నూతన జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ గారు మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్క అందజేయడం జరిగింది.

 

తదనంతరం జాయింట్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఇంచార్జి జాయింట్ కలెక్టర్ మరియు డిఆర్ఓ నుంచి జాయింట్ కలెక్టర్ గా శివ్ నారాయణ్ శర్మ బాధ్యతలను స్వీకరించడం జరిగింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, మధురకి చెందిన జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ 2021 ఐ.ఏ.ఎస్ బ్యాచ్ కు చెందిన వారు. ఐ.ఏ.ఎస్ కు ఎంపికైన అనంతరం ఆయన గుంటూరు జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ గా పనిచేశారు. అనంతరం 2023 డిసెంబర్ 21 నుంచి కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ గా పనిచేస్తూ పదోన్నతి పొంది జిల్లా జాయింట్ కలెక్టర్ గా నియమితులయ్యారు. బుధవారం రాత్రి జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కుల్లాయప్ప, సెక్రెటరీ దివాకర్, డిప్యూటీ తహసీల్దార్ లు చాంద్బాషా, షేక్షావలి, సంజీవ రాయుడు, జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయం సిబ్బంది, తదితరులు పుష్పగుచ్చాలను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

 

———————————————

DIPRO.I&PR.ATP..

Posted Under AP
Editor