- చరిత్రత్మక ప్రాధాన్యత రాతి విగ్రహాలు, పనిముట్లు, వస్తువులు గురించి తెలిస్తే వెంటనే పురావస్తు శాఖకు స్వచ్ఛందంగా అప్పగించండి/ సమాచారం ఇవ్వండి.
- జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్
- రాష్ట్ర పురావస్తు మరియు ప్రదర్శన శాలల శాఖ, పద్మశ్రీ కల్లూరి సుబ్బారావు, జిల్లా పురావస్తు ప్రదర్శన శాలను సందర్శించిన జిల్లా కలెక్టర్
అనంతపురం, ఆగస్టు 11:
నగరంలోని ఆదిమూర్తి నగర్ లో ఉన్న రాష్ట్ర పురావస్తు మరియు ప్రదర్శన శాలల శాఖ, పద్మశ్రీ కల్లూరి సుబ్బారావు, జిల్లా పురావస్తు ప్రదర్శన శాలను ఆదివారం రోజు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా సహాయ సంచాలకులు (టెక్నికల్) డాక్టర్ బి.రజిత స్వాగతం పలికి మ్యూజియం ఆవరణంలోని లాన్ ఏరియాలో ఏర్పాటుచేసిన వివిధ కాలాలకు చెందిన రాతి విగ్రహాలను ప్రదర్శించడం జరిగింది.

మొదటి అంతస్తులో చెక్క పీఠాలపై అద్భుతంగా ప్రదర్శింపబడుతున్న చిన్న రాతి విగ్రహాలను, జైన తీర్థంకరుల విగ్రహాలను, ప్రాచీన, మధ్య, నవీన శిలా యాగాలకు చెందిన రాతి పనిముట్లను
రెండవ అంతస్తులు నవీన, బృహత్ శిలా యుగాలకు చెందిన కుండలు, టెర్ర కోట, సున్నపు బొమ్మలు, పురాతన ఇటుకలు, కాంస్యం ప్రతిమలు, చైనా పింగాణీ పాత్రలు, ఎనామిక్ వేర్, పురాతన నాణెములు మూడవ అంతస్తులు దారు శిల్పాలు, ఆయుధములు & ఆయుధ సామాగ్రి , శాసన నకలలు, రాగి పలక శాసనములు, తాటి ఆకుల రాతప్రతులు మరియు పెయింటింగ్స్ ను తిలకించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. చరిత్ర సంపదను పరిరక్షించుకోవాలన్నారు. ఇందుకోసం జిల్లాలోని ప్రతి గ్రామ, మండల, మున్సిపల్ ఏరియాలు, పొలాలు, నది ప్రదేశాలలో ఏవైనా చరిత్రత్మక ప్రాధాన్యత కలిగిన రాతి విగ్రహాలు, పనిముట్లు, వస్తువులు గురించి మీకు తెలిసిన ఉన్నట్లు తెలిసిన వాటిని జిల్లా పురావస్తు శాఖకు సమాచారం అందజేసి, వీలైతే స్వచ్ఛందంగా అప్పగించుటకు సహకరించాల్సిందిగా పిలుపునిచ్చారు. మీకు ఏవైనా తెలిసిన సమాచారం కొరకు రాష్ట్ర మరియు ప్రదర్శనశాల శాఖ యొక్క E-Mail ID: adatparch@gmail.com మరియు మొబైల్ నెంబర్ :9154143137 కు సమాచారం ఇవ్వవలసిందిగా కోరుతూ.. భారతీయ పౌరులుగా మన బాధ్యతగా మన ప్రాచీన సంపద , ప్రాచీన కలల గురించి రాబోవు తరాలవారికి అందజేసిన వారమవుతామని తెలిపారు. మ్యూజియం యొక్క డిస్ప్లే లో కొన్ని మార్పులు, లైబ్రరీలో పూర్తిస్థాయిలో ఏర్పాట్లను చేయవలసిందిగా ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు (టెక్నికల్) డాక్టర్ వి రజిత, టెక్నికల్ అసిస్టెంట్ మహేంద్ర నాయుడు, టైపిస్ట్ గంగా నరేష్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.
———————–
