అనంతపురం నగరానికి రింగ్ రోడ్డు నిర్మించాలి.. ప్రజల కోసం అతి ప్రధానమైన అవసరం అనంతపురం నగరానికి రింగ్ రోడ్డు ఏర్పాటు..

అనంతపురం నగరానికి రింగ్ రోడ్డు నిర్మించాలి

– : ప్రజల కోసం అతి ప్రధానమైన అవసరం అనంతపురం నగరానికి రింగ్ రోడ్డు ఏర్పాటు

– : పార్లమెంట్ లో ప్రశ్నోత్తర సమయంలో మాట్లాడిన అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మినారాయణ

– : తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

అనంతపురం, ఆగస్టు 08 :

– అనంతపురం నగరానికి రింగ్ రోడ్డు నిర్మించాలని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మినారాయణ కోరారు. గురువారం న్యూఢిల్లీలోని పార్లమెంట్ లో ప్రశ్నోత్తర సమయంలో అనంతపురం పార్లమెంట్ సభ్యులు మాట్లాడారు.

– ఈ సందర్భంగా ఎంపీ అంబికా లక్ష్మినారాయణ మాట్లాడుతూ అనంతపురం నగరానికి రింగ్ రోడ్డు నిర్మించాలని రోడ్డు మరియు ట్రాన్స్పోర్ట్ మంత్రిని కోరారు. తన ప్రశ్నకు స్పందించినందుకు గౌరవ రోడ్డు మరియు ట్రాన్స్పోర్ట్ మంత్రి నితిన్ గడ్కరీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ యొక్క ఖచ్చితమైన దశ గురించి తాము తెలుసుకోవాలనుకుంటున్నామని మరియు ఈ ప్రాజెక్ట్ ప్రారంభానికి ఎలా ముందుకు వెళ్లాలో మాకు తెలియజేయాలని కేంద్ర మంత్రిని ఎంపీ అంబికా కోరడం జరిగింది. ప్రజల కోసం అతి ప్రధానమైన అవసరం అనంతపురం నగరానికి రింగ్ రోడ్డు అని, అనంతపురం – బుక్కరాయసముద్రం చెరువు మరియు దేవరకొండ వంటి భౌగోళిక పరిమితుల కారణంగా ప్రధానంగా పడమర వైపు దిశగా అనంతపురం నగర విస్తరణ చెందుతోందన్నారు. దీనివల్ల ప్రస్తుత జాతీయ రహదారి 44 బైపాస్ కుడి మరియు ఎడమ వైపునే ముఖ్యంగా పరిశ్రమ, వాణిజ్య మరియు వసతి వృద్ధికి దారితీస్తుందన్నారు. అనేక సంవత్సరాలుగా ఈ బైపాస్ రోడ్ ఒక ప్రాథమిక బైపాస్ నుండి స్థానిక రహదారిగా మారింది, అధిక రద్దీ కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వంతెనల నిర్మాణం జరిగినప్పటికీ, అవి పెరుగుతున్న రద్దీని తగ్గించేందుకు తగినవి కావని, ఫలితంగా నగరంలో అధిక రద్దీ ఏర్పడుతోందని తెలిపారు.

– ఈ సమస్యను పరిష్కరించడానికి, అనంతపురం మాస్టర్ ప్లాన్‌లో, ఒక సుదీర్ఘ అధ్యయనం ద్వారా ఆమోదం పొందిన తరువాత, రెండవ బైపాస్ రహదారి ప్రతిపాదన ఉందని, ఈ కొత్త బైపాస్ రహదారి నగర రద్దీని తగ్గించడానికి మరియు ట్రాఫిక్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ఉద్దేశించబడిందన్నారు. ఇది ప్రస్తుత NH 44 బైపాస్ కి వెలుపల ఉన్న నగర దశల వికాసానికి సరిపోయే విధంగా ఈ రెండవ బైపాస్ అమలు నగర రద్దీ ప్రవాహాన్ని మెరుగుపరచడం మరియు నగర పెరుగుదలను కొనసాగించడం కోసం అత్యంత ప్రధానమైనదన్నారు. బైపాస్ రోడ్ రద్దీ నగర రహదారి మరియు NH 44 కి సంబంధించిన ట్రాఫిక్ ని ప్రభావితం చేస్తుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర మంత్రి గారు ఈ సమస్యను పరిగణనలోకి తీసుకొని, NH 44 రెండవ బైపాస్ రోడ్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వమని ఎంపీ కోరారు. దీనికి రోడ్డు మరియు ట్రాన్స్పోర్ట్ మంత్రి సానుకూలంగా స్పందించి ఈ విషయమై తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

———————————————

DIPRO.I&PR.ATP..

Posted Under AP
Editor