అంగరంగ వైభవంగా గడికోట అమ్మవారికి బోనాలు..

YES9 ఆగస్టు 2, పెద్ద శంకరంపేట్.

పెద్ద శంకరంపేట్. ఆషాడ మాసంలో భాగంగా పెద్ద శంకరంపేటలోని గడికోట మహాకాళి దుర్గామాత అమ్మవారికి బోనాల ఊరేగింపు శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవిడి శ్రీ సరస్వతి శిశు మందిర్ నుండి మహిళలు బోనాలు నెత్తిన ఎత్తుకొని భాజా భజంత్రీలతో శివసత్తులు నృత్యాలతో పట్టణ పురవీధుల గుండా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు.అంబదాస్ బోనం ప్రత్యేక ఆకర్షణగా అందరిని ఆకట్టుకుంది. ఉదయం శ్రీ సరస్వతి శిశు మందిర్ నుండి అమ్మవారి తొట్టెల చిత్రపటం పూజా సామాగ్రిని భాజా భజంత్రీలతో ఊరేగింపుగా తీసుకువెళ్లి గడికోటలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భక్తులందరికీ ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో గడికోట ఉత్సవ సమితి బాధ్యులు సురేందర్ రెడ్డి, జంగం శ్రీనివాస్ ,వేణుగోపాల్ గౌడ్ . ఆర్ ఎన్ సంతోష్ కుమార్ అలుగుల సత్యనారాయణ. సుభాష్ గౌడ్.గంగారెడ్డి. సీతారామారావు.రవి వర్మ లక్ష్మణ్ పునయ్య జశ్వంత్ . బాయికాడి నర్సింలు. రాజన్ గౌడ్ . మల్లేశం, సంతోష్ కుమార్. నీల కంటి విట్టల్. శైలేష్ గాండ్ల సంగమేశ్వర్ శ్రావణ్ ఆయా కుల సంఘాల పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Editor