13వ జాతీయ జూనియర్ &సబ్ జూనియర్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో జిల్లా పారా క్రీడాకారులు పథకాలు సాధించడం జిల్లాకు గర్వకారణం.- : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్

అనంతపురం, జులై 22 :

కర్నాటకలోని బెంగుళూరు వేదికగా కంఠీరవ స్టేడియంలో జులై 15 నుంచి 17 వరకు జరిగిన 13వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ & జూనియర్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్-2024 లో అనంతపురం జిల్లాకు చెందిన పారా క్రీడాకారులు నాలుగు పథకాలను సాధించడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో 13వ జాతీయ జూనియర్ &సబ్ జూనియర్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో 4 పతకాలు సాధించిన అనంతపురం పారా క్రీడాకారుల టీమ్ జిల్లా కలెక్టర్ ను కలవగా, వారిని జిల్లా కలెక్టర్ అభినందించారు.

– ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బెంగుళూరులో జరిగిన 13వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ &జూనియర్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్-2024 లో అనంతపురం నుండి 10 మంది పారా క్రీడాకారులు పాల్గొనగా, మొత్తం 4 పథకాల (1 బంగారం, 1 వెండి, 2 కాంస్యం)ను సాధించడం అభినందనీయమన్నారు. పారా క్రీడాకారులు ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని, అనంతపురం పేరుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మారుమ్రోగేలా చేయాలన్నారు.

 

పతకాలు సాధించిన వారి వివరాలు :

1. ( U17 ) AVALI KONDA NARESH (T44)

400M GOLD 🥇LONG JUMP BRONZE 🥉

2. ( U17 ) MALLELA SUDHARSANA ( F13) SHOT PUT SILVER 🥈

3. ( U17 ) AVALAPADU BHARGAVA KUMAR (F44) 100 MM BRONZE🥉

– ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి రసూల్, డీఎస్డీవో షఫీ, ఎస్డీసి శిరీష, నగర ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వరరావు, డీఆర్డీఏ పిడి ఓబులమ్మ, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్.నాగరాజు, కార్యదర్శి ఎన్.శ్రీనివాసులు, SAAP అథ్లెటిక్స్ కోచ్ మంజుల, క్రీడాకారులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor