అనంతపురం, జులై 18 :
జిల్లాలోని మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. గురువారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మాజీ సైనికుల సంఘం సభ్యులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాజీ సైనికుల సమస్యలను తెలియజేయాలని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. మాజీ సైనికుల భూమి సమస్యకు సంబంధించి ఇప్పటి పరిస్థితికి అనుకూలంగా ఈ ఫైలింగ్ చేయాలన్నారు. అసోసియేషన్ లో అందరూ కలిసికట్టుగా ఉండి సమస్యలను పరిష్కారం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా అసోసియేషన్ లోని అక్రమాలు, గృహ స్థలాలు, మాజీ సైనికుల వ్యక్తిగత సమస్యలు, గన్ లైసెన్సు, రెన్యూవల్స్, భూమి ఎన్ఓసీలు, తదితర సమస్యలను జిల్లా కలెక్టర్ కు మాజీ సైనికులు తెలియజేశారు. అంతకుముందు శాలువా కప్పి జిల్లా కలెక్టర్ ని మాజీ సైనికుల సంఘం సభ్యులు సన్మానించారు. ఈ సమావేశంలో మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు పి.విశ్వేశ్వరరావు, మాజీ సైనికులు ఎమ్మెస్ ప్రసాద్, ఆంజనేయులు, రమేష్ రెడ్డి, పెద్దారెడ్డి, నల్లపురెడ్డి, రాజు, నాగేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
