Latest Posts

వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ అరెస్ట్..!

వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పలు మీడియాలో వస్తున్న వార్తా కథనాల ప్రకారం.. తన ఇంట్లో పనిచేసే బాలికతో గతంలో ఆయన అసభ్యంగా ప్రవర్తించారని, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఇటీవలే కేసు నమోదు చేశారని అందులో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయనను కర్నూలులో పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం సుధాకర్ ను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశముందంటూ అందులో చెప్పుకొచ్చారు.

Posted Under AP
Editor