Latest Posts

ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల..!

ఏపీలో 16 వేలకు పైగా టీచర్ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) కు నోటిఫికేషన్ విడుదలయ్యింది. పాఠశాల విద్యాశాఖ అధికారులు సోమవారం ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఆన్‌లైన్ విధానంలో జరగనున్న ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అదేవిధంగా మెగా డీఎస్సీకి సంబంధించి వచ్చే వారం ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నారు. అయితే, డీఎస్సీలో టెట్ కు 20 శాతం వెయిటేజీ ఉన్న విషయం తెలిసిందే.

Posted Under AP
Editor